ఇండస్ట్రీని దోషిగా చూపించొద్దు అంటున్న అక్షయ్ కుమార్

బాలీవుడ్ లో ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారాయి.

ఈ రెండు ఘటనలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మీద జనంలోకి ఒక చెడు అభిప్రాయం వెళ్ళిపోయింది.

బాలీవుడ్ అంటే డ్రగ్స్ అడ్డా అనే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.అక్కడి సెలబ్రెటీలకి డ్రగ్స్ అనేది ఒక అలవాటుగా మారిపోయిందనే ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఉంటున్న ఎవరికీ అయినా బాధ పెడతాయి.ఇప్పుడు అలాగే స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఈ విమర్శలు విపరీతంగా బాధించాయి.

దీంతో ఇప్పుడు కూడా అనవసర విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా తన పని చూసుకునే అక్షయ్ కుమార్ తన ఆవేదనని ఒక వీడియో రూపంలో ప్రెజెంట్ చేశాడు.

ఇండస్ట్రీలో అందరూ కూడా తప్పుడు మనుషులే అనే విధంగా చూడటంపై తన ఆవేదనని పంచుకున్నారు.

ఇవాళ నేను బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నాను.గత కొన్నివారాలుగా నా అభిప్రాయాలు చెబుదామనుకున్నా, ఎంతో ప్రతికూలత కనిపించింది.

ఎవరికి చెప్పాలో, ఎంత మేరకు చెప్పాలో, అసలేం చెప్పాలో నాకు తెలియలేదు.ఇప్పటికీ మమ్మల్ని స్టార్లు అనే పిలుస్తున్నారు.

ఇవాళ బాలీవుడ్ ఈ స్థాయిలో ఉందంటే అది మీ అభిమానం వల్లే.మేం కేవలం ఓ పరిశ్రమ మాత్రమే కాదు, సినిమాలనే మాధ్యమం ద్వారా భారతీయ విలువలు, సంస్కృతిని ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రచారం చేస్తున్నాం.

దేశంలోని ప్రజల సెంటిమెంట్లను సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి.ఇవాళ మీరు కోపంగా ఉన్నారంటే ఆ కోపాన్ని మేం అంగీకరించాల్సిందే.

సుశాంత్ మరణం తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల మీరు ఎంత బాధకు గురయ్యారో మేం కూడా అంతే బాధకు లోనయ్యాం.

మన వద్ద ఏం జరుగుతోందని మనమే ఆశ్చర్యంతో తిలకించేలా ఇప్పటి పరిస్థితులు దారితీశాయి.

చిత్ర పరిశ్రమలోని అనేక రుగ్మతలపై నిశితంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితులేవీ ఇండస్ట్రీలో లేవని మీకు అబద్ధం చెప్పలేను.ప్రతి పరిశ్రమలోనూ, ప్రతి రంగంలోనూ ఉన్నదే.

అయితే, ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తి ఈ వ్యవహారంలో ఉన్నాడని చెప్పలేం.దీన్ని అందరికీ ఆపాదించలేం అని వీడియోలో తన ఆవేదనని అక్షయ్ కుమార్ తెలియజేశారు.

వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!