Akreet Pran Jaswal : 10 నెలలకే మాటలు.. ఏడేళ్లకే సర్జన్.. ఈ బుడ్డోడి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
చిన్న పిల్లలు ఏం చేసినా తల్లీదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.ఈ జనరేషన్ లో చాలామంది పిల్లలు తమ టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు.
అయితే ఒక బుడ్డోడు మాత్రం తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
ఆ బుడ్డోడి పేరు అక్రీత్ ప్రాణ్ జస్వాల్( Akreet Pran Jaswal ) కాగా 10 నెలల వయస్సులోనే నడవడం, మాట్లాడటం చేసిన ఈ బుడ్డోడు రెండేళ్ల వయస్సు వచ్చే సమయానికి చదవడం, మాట్లాడటం నేర్చుకున్నాడు.
అక్రిత్ ప్రతిభను గుర్తించిన పేరెంట్స్ అతడిని ఆ దిశగా ప్రోత్సహించడం జరిగింది.ఐదేళ్ల వయస్సులోనే అక్రీత్ ప్రాణ్ జస్వాల్ ఇంగ్లీష్ క్లాసిక్స్ చదవడంతో పాటు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ లు చదవడంపై కూడా ఆసక్తి చూపేవాడు.
ఏడేళ్ల వయస్సు ఉన్న సమయంలోనే అక్రీత్ ప్రాణ్ జస్వాల్ ఎనిమిది సంవత్సరాల బాలుడి కాలిన చేతులకు ఆపరేషన్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు.
"""/" /
12 ఏళ్ల వయస్సులోనే అక్రీత్ ప్రాణ్ జస్వాల్ చండీగడ్ యూనివర్సిటీలో( Chandigarh University ) చేరి దేశంలోనే పిన్నవయస్సు యూనివర్సిటీ స్టూడెంట్ గా నిలిచారు.
తన ప్రతిభతో అక్రిత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం గమనార్హం.ప్రపంచ ప్రఖ్యాత టాక్ షోలలో సైతం అక్రిత్ పాల్గొన్నారు.
ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్( IIT Kanpur ) లో అక్రీత్ రసాయన శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు.
అక్రిత్ టాలెంట్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. """/" /
అత్యధిక ఐక్యూ కలిగి ఉన్న వాళ్లలో అక్రీత్ ప్రాణ్ జస్వాల్ కూడా ఒకరు కావడం గమనార్హం.
ప్రస్తుతం అక్రీత్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం గురించి పరిశోధనలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
అక్రీత్ చిన్న వయస్సులోనే వైద్య మేధావిగా పేరు సంపాదించుకున్నారు.అక్రీత్ సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అక్రీత్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…