మంచు లక్ష్మితో అక్కినేని సుమంత్… వైరల్ అవుతున్న ఫోటో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మంచు వారసురాలిగా అడుగుపెట్టారు నటి మంచు లక్ష్మి.ఈమె అనగనగా ఓ ధీరుడు సినిమాతో నెగిటివ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈమె పలు సినిమాలలో నటిస్తూ నటిగా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం మోహన్ లాల్ హీరోగా నటించిన మాన్ స్టర్ సినిమాలో ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించారు.

ఇలా ఈమె లెస్బియన్ పాత్రలో నటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.ఇక మంచు లక్ష్మి కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా టాక్ షోలను నిర్వహిస్తూ వచ్చారు.

"""/"/ ప్రస్తుతం ఈమె తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఆకాశ నక్షత్రం అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే నటుడు అక్కినేని సుమంత్ తో తాజాగా ఈమె కలిసి దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/"/ సుమంత్ పుట్టినరోజు సందర్భంగా మంచు లక్ష్మి అతనితో చాలా చనువుగా కలిసి దిగినటువంటి ఫోటోను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి హేవ్.ఏ గ్రేట్ ఇయర్ ఎహెడ్ అంటూ సుమంత్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలో వీరిద్దరు కాస్త చనువుగా ఉండటంతో క్షణాల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో పై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

సుజీత్ ఇక మీదటైన తొందరగా సినిమాలు చేస్తాడా..?