అన్నపూర్ణ స్టూడియో వ్యవహారంలో అక్కినేని .. ఎన్టీఆర్ లు ఒకరిపై ఒకరు సవాల్

హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించాలని కంకణం కట్టుకున్న అక్కినేని నాగేశ్వరరావుకి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్టూడియో కోసం స్థలం కేటాయిస్తామని మాట ఇచ్చారు.

అయితే అక్కినేని మాత్రం తనకు ఉచితంగా ఇవ్వొద్దని, స్థలం కొనుక్కుంటానని అన్నారు.అలా స్థలం కొని అన్నపూర్ణ స్టూడియోని నిర్మించారు.

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ కి ఆనుకుని 5 ఎకరాల ల్యాండ్ ఉంది.మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ 5 ఎకరాల ల్యాండ్ ను అవుట్ డోర్ షూటింగుల కోసమని ప్రభుత్వం కేటాయించింది.

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని కేటాయించిందని, సినీ పరిశ్రమకు సంబంధించిన పనులు మాత్రమే ఇందులో జరపాలని, ఇతర పనుల కోసం స్థలాన్ని వినియోగించకూడదని కొన్ని నిబంధనలతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే అప్పటికే అన్నపూర్ణ స్టూడియో బాగా అభివృద్ధి చెంది ఉండడం, దాని కోసం అక్కినేని అప్పటికే సర్వం ధారపోసి నిర్మించడం వంటి కారణాల వల్ల ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల ల్యాండ్ లో స్టూడియోకి సంబంధించి ఎలాంటి పనులూ చేయలేదు.

కొన్నాళ్ళ తర్వాత సినీ నిర్మాత చదలవాడ తిరుపతిరావుతో కలిసి ఈ ల్యాండ్ లో "అనురాధ టింబర్ డిపో" ను స్టార్ట్ చేశారు.

వ్యాపారం కొన్నాళ్లు సజావుగా సాగింది.అయితే అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ సమయంలో ఆ ఏరియా వైపు వెళ్తుండగా ఈ టింబర్ డిపో కనబడింది.

ఇది ఎవరిదని ఆరా తీశారు? ఏఎన్నార్ దని తెలుసుకున్న ఎన్టీఆర్, ఆ స్థలాన్ని గత ప్రభుత్వం స్టూడియో అభివృద్ధి కోసం కేటాయించింది.

కానీ ఏఎన్నార్, సినిమా షూటింగుల కోసం కాకుండా, తన వ్యాపారం కోసం వాడుకుంటున్నారని, ప్రభుత్వ భూమి దుర్వినియోగం అవుతుందని, అక్కినేని నిబంధనలను ఉల్లాఘించారని అధికారులు వివరించారు.

దీంతో ఎన్టీఆర్, 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవిన్యూ అధికారులకు ఆదేశించారు.

నిబంధనల మేరకు 5 ఏళ్లలో స్టూడియో ఏర్పాటుచేయలేదు, సరికదా నిబంధనలను ఉల్లంఘించి కలప వ్యాపారం చేస్తున్నందుకు ప్రభుత్వం ఈ 5 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

"""/"/ దీంతో అక్కినేని ఒక్కసారిగా షాక్ అయ్యారు.తన సహ నటుడు సిఎంగా ఉండగా ఇలా ఎలా జరిగిందా అని ఆరా తీయగా, స్వయానా ఎన్టీఆరే నోటీసులు జారీ చేయమన్నారని తెలియడంతో అక్కినేని ఏమీ అనలేకపోయారు.

పోనీ ఎన్టీఆర్ ని కలిసి పరిష్కరించుకుందామంటే ఇద్దరి మధ్య విబేధాలు ఉండేవి.దీంతో ఏఎన్నార్, రామోజీరావుని కలిశారు.

ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ ను ఏఎన్నార్ ఇంటికి పంపించి ఇంటర్వ్యూ చేయించారు.

స్టూడియో కోసం 5 ఎకరాల ల్యాండ్ కేటాయింపుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో, అలానే ఎన్టీఆర్ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులు జిరాక్స్ కాపీలు జర్నలిస్ట్ చేతికిచ్చి చదవమన్నారు ఏఎన్నార్.

అయితే తాను చెప్పినట్లుగా కాకుండా, అది చదివి మీకు అర్ధమయినట్లుగా పేపర్ లో రాయండి.

లేదంటే ఎన్టీఆర్ ఫీలవుతాడు.మీకు తెలుసు నేను అన్నపూర్ణ స్టూడియోస్ కోసం ఎంత కష్టపడ్డానో? కొండల్లో రాళ్ళను తొలిచి మొక్కలను పెంచుతున్నాను.

పర్మినెంట్ ఫ్లోర్ లు వేశాను.ఇదంతా చూసే చెన్నారెడ్డి గారే అవుట్ డోర్ షూటింగులకు పనికొస్తుందని ఈ 5 ఎకరాలను ప్రభుత్వం తరపున కేటాయించారు.

అయితే తాను అంతకుముందు లానే ఈ స్థలాన్ని కొనుక్కుంటానంటే, ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఇస్తుందిలే అని ఇచ్చారు.

ప్రస్తుత అవసరాలకు అన్నపూర్ణ మెయిన్ స్టూడియో సరిపోతుంది.అందుకే కింది 5 ఎకరాలను ఖాళీగా పెట్టాను.

ఖాళీగా ఉంది కదా అని నా మిత్రుడు చదలవాడ తన టింబర్ ను నిలవ చేసుకుంటానని అడిగితే అంగీకరించానని అన్నారు.

పైగా కలప బ్యాక్ డ్రాప్ లో రెండు షూటింగ్ లు కూడా జరిగాయి.

కేవలం నా మీద కోపంతోనే దీన్ని లాక్కోడానికి ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఏఎన్నార్ జర్నలిస్ట్ తో అన్నారు.

ఆ తర్వాత ఈ కథ మొత్తం పేపర్ లో ప్రింట్ అయ్యింది.అది చదివిన సినీ ప్రముఖులు కొంతమంది ఏఎన్నార్ కు సపోర్ట్ చేయగా, కొంతమంది ఎన్టీఆర్ కు సపోర్ట్ చేశారు.

ఈ విషయంలో ఎన్టీఆర్ దే తప్పు అని కూడా అన్నారు.ఆ తర్వాత షూటింగుల కోసం కలపను ఉంచామని చెప్పిన ఏఎన్నార్, తరలిస్తున్నట్లు కూడా చెప్పారు.

ఇక అప్పటినుండి ఆ 5 ఎకరాల ల్యాండ్ లో సినీ పరిశ్రమకు సంబంధించిన పనులే జరుగుతున్నాయి.

తెరవెనుక ఏం కథ నడిచ్చిందో, ఎన్టీఆర్ ని ఎంతమంది పెద్దలు కూల్ చేశారో తెలీదు కానీ ఎన్టీఆర్ ఇక ఏఎన్నార్ ని ఏమీ అనలేదు.

ఏది ఏమైనా గాని ఏఎన్నార్ చేసింది తప్పే, కానీ ఎన్టీఆర్ అలా నోటీసులు పంపించకుండా ఉండాల్సింది, తోటి నటుడే కాబట్టి పర్సనల్ గా కలిసి చెప్పి ఉంటే బాగుండేదని అప్పట్లో కొంతమంది అభిప్రాయపడ్డారు.

బాహుబలి తీసినట్టు ఫీల్ అవుతున్నావ్.. బలగం డైరెక్టర్ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారా?