ఏఎన్ఆర్ ఆఖరి ఫోటోను మీరు చూశారా ?

సౌత్ సినీ ఇండస్ట్రీలో అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు.ఆయన నటన అందరి గుండెల్లో నిలిచి పోయింది.

తన నటనతో మంచి గుర్తింపు సాధించుకొని అత్యుత్తమ నటుడు పురస్కారాలు ఎన్నో అందుకున్నారు.

1940 లో ధర్మపత్ని అనే చిత్రంలో బాలనటుడిగా పరిచయం అయ్యి 1944లో కథానాయకుడిగా సీతారామజననం చిత్రంలో నటించారు.

దాదాపు 256 సినిమాల్లో నటించిన ఏఎన్ఆర్ తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించారు.

పౌరాణిక, జానపద సినిమాల్లో నటించిన ఆయన మరేన్నో మరపురాని చిత్రాల్లో నటించి, అప్పట్లోనే కాకుండా ఇప్పట్లో కూడా అభిమానుల గుండెల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా 14 అవార్డులను సొంతం చేసుకున్నారు.ఒక నటుడిగానే కాకుండా సమాజసేవలో ముందున్నారు.

విద్యార్థులకు కళాశాలలను నిర్మించి వాళ్ళకి విరాళాలు కూడా అందించారు.ఇలాగా ఆయన జీవితం సాగుతూ చివరిసారిగా తన కుటుంబంతో కలిసి "మనం" చిత్రంలో నటించారు.

ఈ సినిమానే ఆయనకు చివరి సినిమాగా నిలిచింది.2014 జనవరి 22న శ్వాస ఇబ్బంది తో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

2014లోనే వచ్చిన ఆయన నటించిన సినిమా మనం మంచి విజయం సాధించింది.ఆ సినిమాల్లో నాగేశ్వరరావు గారు నాగ చైతన్య పేరు పాత్రలో నటించారు.

ఇక అలాంటి ఫ్యామిలీ సినిమా మనం షూటింగ్ సమయంలో నాగేశ్వర రావు గారు కూర్చొని ఉన్న షూట్ ను తీస్తుండగా.

నాగార్జున తన సెల్ ఫోన్ లో ఆ ఫోటోను తీశారట.ఇక మనం సినిమానే చివరి సినిమా అయినా సంగతి తెలిసిందే.

అయితే నాగార్జున ఆ ఫోటోను షేర్ చేస్తూ "సెల్ ఫోన్లో నేను ఆఖరిగా తీసిన నాన్న ఫోటో ఇదే" అంటూ గతంలో చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా ఏఎన్ఆర్ స్థానంలో మరో నటుడు రాలేడు.రారు.

మరి మీరు ఏం అంటారు?.

తేజ సజ్జా జై హనుమాన్ సినిమాలో ఉంటాడా..?