నాగ్ వైల్డ్ డాగ్ కి కరోనా దెబ్బ... షూటింగ్ వాయిదా

కరోనా ఎఫెక్ట్ ఆసియా దేశాలని ఇప్పుడు తీవ్రంగా భయపెడుతుంది.ఎక్కువగా ఎక్కడైతే ఇష్టారాజ్యంగా జంతువులని చంపుకొని తింటారో అక్కడ ఈ కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది.

ప్రస్తుతం చైనాలో అతి పెద్ద విపత్తుగా మారినా కరోనా వైరస కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోగా, వేల సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి హాస్పిటల్స్ లో చికిత్సలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇండియాలో కేరళ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కరోనా వైరస్ మెల్లగా విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది.

కేరళ ప్రజలు కూడా ఆహారం విషయంలో హద్దులు లేకుండా ఉంటారు.దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా విస్తరిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ సినిమాల మీద కూడా పడింది.

అందులో నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కూడా ఉండటం విశేషం.ఈ సినిమా షూటింగ్ ని 20 రోజుల పాటు థాయ్ లాండ్ లో షూట్ చేయాలని భావించారు.

దానికి షెడ్యూల్ కూడా ఖరారు చేసారు.అయితే థాయిలాండ్‌ని కూడా కరోనా వైరస్ తాకింద‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో థాయ్ లాండ్ లో జరగాల్సిన ఈ సినిమా షెడ్యూల్ లో వాయిదా వేసుకొని వేరొక లొకేషన్ కోసం దర్శకుడు సోలోమన్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక రియల్ క్రైమ్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా కింగ్ నాగార్జున మరోసారి ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకే .. ఆ యువ ఎంపీ వైపు  బాబు మొగ్గు ?