థాంక్ యూ రివ్యూ: నాగచైతన్య యాక్టింగ్ పీక్స్.. కథ మాత్రం?
TeluguStop.com
డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా థాంక్యూ.ఇందులో నాగచైతన్య, రాశిఖన్నా నటీనటులుగా నటించారు.
అంతేకాకుండా మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు రాజు, శిరీష్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.తమన్ మ్యూజిక్ అందించాడు.
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
అంతేకాకుండా లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమా తర్వాత మరో సక్సెస్ కోసం చూస్తున్న చైతుకి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూడాలి.
H3 Class=subheader-styleకథ: /h3pకథ విషయానికి వస్తే.నాగచైతన్య అభిరామ్ అనే పాత్రలో కనిపిస్తాడు.
ఇక ఈయన అమెరికాలో కంపెనీ పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రయత్నించగా అనుకున్నది సాధిస్తాడు.
ఆ సమయంలో తనలో వచ్చిన మార్పుల వల్ల తను తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు.
అంతేకాకుండా తనని ఇష్టపడే వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తాడు.దీంతో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
ఇంతకు ఆ ఇబ్బందిలేమిటి.ఆయనలో ఎలాంటి మార్పులు వచ్చాయి.
చివరకు ఆయన తన క్యారెక్టర్ ను మార్చుకుంటాడా లేదా మిగిలిన కథలోనిది. """/"/
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p ఈ సినిమాకు నాగచైతన్య బాగా హైలైట్ గా నిలిచాడు.
ఇక గత సినిమాల కంటే ఇందులో మరింత కొత్తగా కనిపిస్తాడు చైతన్య.పైగా తన యాక్టింగ్ తో మరింత ఆకట్టుకున్నాడు.
ఇక రాశిఖన్నా, అవికా, ప్రకాష్ రాజ్ తమ పాత్రలకు ఎప్పటిలాగే న్యాయం చేశారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమా కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు.
కానీ సినిమా కథ ఆల్రెడీ ఊహించ్చినట్లు ఉంది.తమన్ అందించిన మ్యూజిక్ ఈసారి ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఎడిటింగ్ లో ఇంకొన్ని మార్పులు చేస్తే బాగుండేది.
"""/"/
H3 Class=subheader-styleవిశ్లేషణ: /h3pకొన్ని సందర్భాలలో ఈ సినిమా కథ ముందుగానే ఏం జరుగుతుందో అన్నట్లుగా తెలిసిపోయినట్లు ఉంటుంది.
నిజానికి కథలో కాస్త కొత్తదనం లేదు అన్నట్లు ఉంది.కానీ సినిమా మాత్రం ఒక డీసెంట్ గా కనిపిస్తుంది.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నాగచైతన్య యాక్టింగ్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మంచి మెసేజ్.
తక్కువ రన్ టైం. """/"/
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోయాయి.
కథలో కాస్త మార్పులు ఉంటే బాగుండేవి.సంగీతంలో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది.
H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p ఇక ఈ సినిమా కథ ముందే ఊహించినట్లు ఉన్నా కూడా సినిమా మొత్తం ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పవచ్చు.
ముఖ్యంగా నాగచైతన్యను కొత్తదనంతో చూడాలి అనుకునే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
మొత్తానికి ఈ సినిమాను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గా చూడవచ్చు అని అర్థమవుతుంది.
కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో చూడవచ్చు.h3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.
ఆశ్చర్యం: కారులో వెళ్తూనే బిడ్డను ప్రసవించింది.. వీడియో వైరల్..