ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని హీరో సుశాంత్... షూటింగ్ మొదలు పెట్టిన యంగ్ హీరో?
TeluguStop.com

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా, కాళిదాసు సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యారు నటుడు సుశాంత్.


ఇలా మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న సుశాంత్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించారు.


అయితే ఈయన నటించిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే ప్రస్తుతం ఈ హీరో మరొక అడుగు ముందుకు వేసి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు వెబ్ సిరీస్ ల ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సుశాంత్ కూడా వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన కథ తనకు నచ్చడంతో వెంటనే ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ZEE5 వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకున్నాడు.
"""/"/
ఈ వెబ్ సిరీస్ కి వరుడు కావలేను ఫేమ్ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.
ఇందులో సుశాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇక ఈ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్న హీరో సుశాంత్ ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆమేనా కారణమా?