శ్యామ్ సింగ రాయ్ సూపర్ అనేసిన అక్కినేని హీరో..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేట్రికల్ రన్ సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది.

థియేటర్ లో సినిమా చూడని ఆడియెన్స్ ఓటీటీలో చూసి సినిమా పై ప్రశంసలు అందిస్తున్నారు.

లేటెస్ట్ గా నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా చూసి సూపర్ అనేశాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.

సాలిడ్ అండ్ మూవింగ్ ఫిల్మ్ శ్యామ్ సింగ రాయ్ కంగ్రాట్స్ బాబాయ్ అంటూ నానికి డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ కి ట్యాగ్ చేశాడు సుమంత్.

సుమంత్ శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ట్వీట్ చేయడంపై నాని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని తన నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ చూపించాడు.

సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టిల నటన కూడా హైలెట్ గా నిలిచింది.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా సినిమాకు సూపర్ హెల్ప్ అయ్యింది.శ్యామ్ సింగ రాయ్ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంటుంది.

నాని కెరియర్ లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా శ్యామ్ సింగ రాయ్ వచ్చింది.

సినిమాతో సక్సెస్ తో నాని ఫుల్ ఖుషిలో ఉన్నాడు.

వైరల్ వీడియో: దేవుడా ఎంత పెద్ద జీవిని ఎరగా మింగేసిన కింగ్ కోబ్రా.. చివరకి..