అక్కడికి వెళ్ళమంటూ ఫ్యాన్స్ కి సలహా ఇచ్చిన నాగచైతన్య.. ఆమెను తీసుకెళ్తున్నావా అంటూ ట్రోల్స్?

సమంతతో బ్రేకప్ తర్వాత నాగచైతన్య గురించి ఏ వార్త వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఏడాది కిందట నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.అప్పటినుంచి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు ఎవరి గురించి పోస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా వారి పోస్టులను తెగ చూసేస్తున్నారు నెటిజన్స్.

అప్పుడప్పుడు చేసే పోస్టుల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు.తాజాగా నాగచైతన్య ఒక పోస్ట్ షేర్ చేయగా బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. """/"/ టాలీవుడ్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు నాగచైతన్య.

కానీ తండ్రి నాగార్జున లాగా స్టార్ హోదా మాత్రం దక్కలేకపోయింది.అంతేకాకుండా తన తమ్ముడు అఖిల్ కి కూడా సరైన సక్సెస్ అనేదే లేకపోయింది.

ఇక నాగచైతన్య  2009లో జోష్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.తొలి నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగచైతన్య.

"""/"/ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టగా అక్కడ ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.

కానీ మళ్ళీ ఇంతవరకు తమిళంలో అడుగుపెట్టలేదు.ఇక 2017లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో తన మాజీ భార్య సమంత కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా పలు సినిమాలలో నటించగా చాలా వరకు మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా గుర్తింపుని ఇచ్చాయి.కానీ ఇప్పటివరకు ఇతడు స్టార్ హీరో కాలేకపోయాడు.

"""/"/ ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నాగచైతన్య.సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత కూడా ఇద్దరు పలు సినిమాలలో నటించారు.  టాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా కనిపించింది.

కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడాకుల పేరుతో షాక్ ఇచ్చారు.

విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బతుకుతున్నారు.అయితే గత ఏడాది నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని బాగా గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

పైగా వీరిద్దరి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు అని బాగా వార్తలు కూడా వినిపించాయి.

కానీ అవన్నీ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు అక్కినేని ఫ్యామిలీ.అయినా కూడా నెటిజన్స్ మాత్రం వారి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుంది అని గుసగుసలాడుతున్నారు.

"""/"/ అయితే ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా అతడు బైక్ రేసింగ్ సంబంధించిన దాని గురించి ప్రమోషన్ చేశాడు.అంతే కాకుండా అక్కడికి వెళ్లాలంటూ తన ఫాలోవర్స్ కి సలహా కూడా ఇచ్చారు.

అయితే వెంటనే ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆ వీడియోకు రకరకాలుగా స్పందించగా.

ఓ నెటిజన్ మాత్రం.నువ్వు పోతున్నావా శోభిత అక్కని తీసుకుపోతారా అంటూ కామెంట్ పెట్టగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

నా భార్యకు తల్లీతండ్రి అన్నీ తానే.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!