ఎన్టీఆర్ పేరు పెట్టారు ఏఎన్నార్ పేరు పెడతారా.. అక్కినేని ఫ్యాన్స్ కోరిక ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే.

సీఎం జగన్ ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంతో ఏఎన్నార్ అభిమానులు ఏఎన్నార్ పేరు కూడా ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ ను తెరపేకి తెస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.ఏఎన్నార్ ఫ్యాన్స్ మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరును పెట్టాలని కోరుకుంటున్నారు.

అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడు అయిన సర్వేశ్వరరావు తమ కోరికను ఏపీ సర్కార్ గౌరవించాలని కోరారు.

ఏఎన్నార్ వందల సంఖ్యలో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

కృష్ణా జిల్లాలోని గుడివాడ రామాపురంలో ఏఎన్నార్ జన్మించారు.తన సినీ కెరీర్ లో ఏఎన్నార్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఆ పాత్రల ద్వారా విజయాలను సొంతం చేసుకున్నారు.

సినిమా రంగానికి ఏఎన్నార్ చేసిన సేవలకు ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది.

"""/"/ మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెడితే వ్యతిరేకించే వాళ్లు కూడా ఎవరూ ఉండరు.

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఏఎన్నార్ ను కోరినా ఏఎన్నార్ మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడం గమనార్హం.

సినిమా రంగం హైదరాబాద్ కు రావడంలో ఏఎన్నార్ కృషి ఎంతో ఉంది. """/"/ అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న ఈ డిమాండ్ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఏపీలో 26 జిల్లాలు, మూడు రాజధానుల నుంచి పరిపాలన మొదలు కానుందని సమాచారం.

ఏఎన్నార్ కళారంగానికి సేవలు చేసిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.

నాగార్జున ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే.భవిష్యత్తులో ఈ ప్రతిపాదన దిశగా అడుగులు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ కొత్త ఎన్నికల షెడ్యూల్..!!