గొప్ప మనస్సు చాటుకున్న అక్కినేని ఫ్యామిలీ.. అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకున్నారుగా!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.అక్కినేని హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
నాగార్జున, నాగచైతన్య, అఖిల్( Nagarjuna, Naga Chaitanya, Akhil ) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయి.
భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయనే సంగతి తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద బాధితులకు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.
భారీ వర్షాల ( Heavy Rains )వల్ల వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
బాధితులను ఆదుకోవడానికి పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ముందుకు రాగా తాజాగా ఆ జాబితాలో అక్కినేని ఫ్యామిలీ సైతం నిలిచింది.
అటు ఏపీకి ఇటు తెలంగాణకు అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) చెరో 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించింది.
"""/" /
అక్కినేని హీరోల మనస్సు మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నాగార్జున ప్రస్తుతం కుభేర, కూలీ సినిమాలతో బిజీగా ఉండగా నాగచైతన్య తండేల్ సినిమాతో బిజీ అయ్యారు.
అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అఖిల్ సైతం త్వరలో షూటింగ్స్ లో పాల్గొనాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు అక్కినేని హీరోల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.
నాగార్జున సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుండగా నాగచైతన్య 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
అఖిల్ ( Akhil Akkinen )పారితోషికం 10 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తమని తెలుస్తోంది.
అక్కినేని హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కలెక్షన్ల పరంగా సైతం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
అక్కినేని హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.
50 ఏళ్ల క్రితం జాబ్ లెటర్ పంపిన మహిళకు ఊహించని సర్‌ప్రైజ్..?