అక్కినేని ఫ్యామిలీ మరో మల్టీ స్టారర్ ప్లాన్..!

అక్కినేని హీరోలు మరో మల్టీ స్టారర్ ప్లానింగ్ లో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఆల్రెడీ మనంతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని హీరోలు ఈమధ్యనే వచ్చిన బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు.

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈసారి నాగార్జున అఖిల్ కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాని తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ట్ చేస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున ది ఘోస్ట్.అఖిల్ ఏజెంట్ సినిమాలను చేస్తున్నారు.

ఈ సినిమాల పూర్తయిన తర్వాత నాగార్జున, అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

డైరక్టర్ మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు.

అక్కినేని మల్టీస్టారర్ కూడా చేస్తే అతను తెలుగులో డైరక్టర్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

గాడ్ ఫాదర్ హిట్ అయితే మాత్రం మోహన్ రాజాకి తెలుగులో కూడా మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.

 నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు కలిసి చేసే మల్టీస్టారర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు.