మెగా డాటర్స్ తో అక్కినేని కోడలు.. వైరల్ అవుతున్న ఫోటో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ ఒకటి అని చెప్పాలి.

ఇక అక్కినేని కోడలిగా అక్కినేని అమల ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే చాలా కాలం తర్వాత ఈమె ఒకే ఒక జీవితం వంటి అద్భుతమైన చిత్రంలో నటించి ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశారు.

ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించిన అమల అందరిని ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు.

ఇలా నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరకు దూరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించని అమల తాజాగా మెగా డాటర్స్ తో కలిసి సందడి చేశారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజతో కలిసి ఈమె ఒక షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హైదరాబాదులో కళామందిర్ రాయల్ బ్రాండ్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

"""/"/ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నూతనంగా నిర్మించిన ఈ షోరూం నేడు ప్రారంభం కాగా ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగా డాటర్స్ తో పాటు అమల అక్కినేని సందడి చేశారు.

ఇలా అమల మొదటిసారి షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరితోపాటు ప్రముఖ డిజైనర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Skill Vs Luck: Data Analytics, Player Strategy, And The Reality Behind Bluff Bet Casino For Canadian Crypto Users