చైతన్య పెంపకం గురించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వాళ్ల అమ్మ ఎంతో పద్దతిగా పెంచిందంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే.ఈ కుటుంబం కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.
అక్కినేని నాగేశ్వరరావు నుండి అక్కినేని అఖిల్ వరకు హీరోలుగా పరిచయమై తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా నాగేశ్వరరావు ఆయన కొడుకు నాగార్జున మాత్రం స్టార్ హీరోలుగా ఒక హోదాని సంపాదించుకున్నారు.
ఇక నాగార్జున భార్య అమల మొదట్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉండి ఇంటికే పరిమితమైంది.
అమల నాగార్జున కు రెండో భార్య కాగా.నాగార్జున అంతకుముందే లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు.
వీరికే నాగచైతన్య జన్మించగా.నాగార్జున, అమలకు అఖిల్ జన్మించాడు.
ఇక ప్రస్తుతం నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ కూడా పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉన్నారు.
నిజానికి నాగ చైతన్య, అఖిల్ స్టార్ హీరోలుగా మాత్రం ఎదలేకపోతున్నారు.నాగచైతన్య మాత్రం ప్రస్తుతం స్టార్ హీరో హోదాను సంపాదించుకోవడానికి దగ్గర్లో ఉన్నాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగాడు.
అప్పుడప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చి సమయాన్ని గడిపేవాడు.ఇక ఇటీవలే మాతృ దినోత్సవం రోజు అమల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది.
నాగ చైతన్య సెలవుల్లో హైదరాబాద్ కు వచ్చే వాడని తెలిపింది.నాగచైతన్యను తను పెంచలేదని, వాళ్ళ అమ్మ పెంచింది అని.
చెన్నైలో చైతన్య పెరిగాడు అని చెప్పుకొచ్చింది. """/" / వాళ్ళమ్మ నాగచైతన్యను ఎంతో పద్ధతిగా పెంచింది అని తెలిపింది.
ఇక రెండు మూడు నెలలకు ఒకసారి హైదరాబాద్ కు నాగచైతన్య వచ్చి తన తండ్రితో ఎక్కువ సమయం గడిపేవాడని బాగా ముచ్చట్లు పెట్టుకునే వారని చెప్పుకొచ్చింది.
అఖిల్ కూడా తన అన్న వచ్చాడు అంటే నాగచైతన్య వెంటనే తిరిగేవాడని.నిజానికి నాగచైతన్య వెంట ఒక తోకలా ఉండే వాడని.
అన్న అన్న అంటూ వెంట పడుతూ ఉండేవాడు అని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకునేవారు అని తెలిపింది.
"""/" /
ఇక నాగచైతన్య ఇంటికి వచ్చినప్పుడు అమ్మ కూడా గుర్తు ఉండదు అని.
అసలు ఆ సమయంలో అఖిల్ కు అమ్మ అవసరం లేదు అని తెలిపింది.
ఇద్దరిలో అఖిల్ హైపర్ యాక్టివ్ గా ఉంటూ అల్లరి చేస్తూ ఉంటాడు అని నాగచైతన్య మాత్రం సైలెంట్ గా ఉంటాడు అని తెలిపింది అమల.
నాగార్జున.దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మి ను 1984 లో అందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత వీరికి నాగచైతన్య జన్మించాడు.ఇక 1990లో వీరిద్దరికి మనస్పర్థలు రావడంతో విడాకులతో దూరమయ్యారు.
ఇక ఆ తర్వాత తనతో పాటు తన సినిమాలలో కలిసి నటించిన అమలను ప్రేమించాడు.
ఆమెను 1992లో వివాహం చేసుకున్నాడు.వీరికి అఖిల్ పుట్టాడు.
Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers