టబుతో నాగ్ కు ఎఫైర్ అంటూ ప్రచారం.. ఆ వార్తలపై అమల ఏమన్నారంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మథుడిగా పేరుంది.నాగ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
మరికొన్ని రోజుల్లో నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే నాగార్జున గురించి గతంలో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రముఖ హీరోయిన్ టబుతో నాగార్జునకు ఎఫైర్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నాగార్జున, టబు కలిసి పలు సినిమాల్లో నటించడం ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడంతో ఈ తరహా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే నాగార్జున, టబు ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు.అయితే తాజాగా అమల ఈ వార్తల గురించి స్పందించి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.
ఒకే ఒక జీవితం సినిమాతో అమల ఖాతాలో సక్సెస్ చేరిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించిన అమల ఆ పాత్ర ద్వారా ప్రశంసలు అందుకున్నారు.
"""/" / నాగ్ టబు ఎఫైర్ గురించి మాట్లాడుతూ టబు నా భర్తకు, నాకు మంచి ఫ్రెండ్ అని ఆమె అన్నారు.
నాగార్జున టబు మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని అమల తెలిపారు.
నేను సంతోషంగా ఉన్నానని మా కుటుంబంలో ఏదో జరుగుతోందని బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
"""/" /
మా ఇంట్లో సినిమాల గురించి చర్చ జరగదని కుటుంబ వ్యవహారాల గురించి మాత్రమే చర్చ జరుగుతుందని అమల కామెంట్లు చేశారు.
మా ఇల్లు దేవాలయంలా పవిత్రంగా ఉంటుందని అమల చెప్పుకొచ్చారు.అమల వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
అమల క్లారిటీతో ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.
బిగ్ బాస్ షో వల్లే నా పేరు నాశనం.. తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు వైరల్!