'సమంత వదినా...ఇది నీ కోసం' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన 'అఖిల్'... ఇంతకీ అదేంటి అంటే.?
TeluguStop.com
సమంత.పరిచయం అక్కర్లేని పేరు.
ఏం మాయ చేసావేతో కుర్రాళ్ళ హృదయాలకి గేలం వేసింది.గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది.
సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది.ఆమె సినిమాలు వదిలేస్తుంది అని ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది.
కానీ అది అవాస్తవం అని స్పందించింది సమంత.టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.
ఇటీవల ఆమె నటించిన ‘యూటర్న్’ సినిమా ట్రైలర్‌తో పాటు ఓ పాటను విడుదల చేశారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కన్నడ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు.
ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
చిత్ర ప్రచారంలో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పాడిన పాటకు సమంత స్టెప్పులేస్తూ కనిపించిన ‘కర్మ థీమ్’ అనే స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.
దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.సమంత డాన్స్ వీడియో చూసిన మరిది అఖిల్.
వదిన వేసిన స్టెప్పులలాగా డ్యాన్స్ చేస్తూ ‘ అల్ ది బెస్ట్ వదినా’ అని అడ్వాన్స్ విషెస్ తెలిపాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అఖిల్.
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!