సరికొత్త లుక్ లో అకీరా నందన్.. ఆనందంలో పవర్ స్టార్ అభిమానులు?
TeluguStop.com
టాలీవుడ్ సినిమా ఖ్యాతిని సినిమా సినిమాకి ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నారు మన దర్శక నిర్మాతలు.
దీంతో టాలీవుడ్ సినిమాలకు గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ దొరికారు.అయితే ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి, నాగచైతన్య,రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోల వరకు తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటుగా పాన్ ఇండియాస్టార్లుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తరువాత జనరేషన్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. """/" /
సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోలు హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం అన్నది సర్వసాధారణమైన విషయమే.
అయితే కొన్నిసార్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ కొందరు హీరోగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తే మరి కొందరు కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ తర్వాత జనరేషన్ కూడా స్టార్లు దొరికేసారని అభిమానులు నెటిజన్స్ చెప్పడంతో పాటు వారి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషపడుతున్నారు.
మరి ఆ స్టార్లు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్, అలాగే మహేష్ బాబు తనయుడు గౌతమ్.
"""/" /
ప్రస్తుతం మీ ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాదులో జరిగిన ప్రిక్స్ ఈవెంట్ కి హాజరైన వీళ్ళ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యూచర్ స్టార్లు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారు కూడా సార్లుగా రాణించాలని తప్పకుండా రాణిస్తారు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఇప్పటికే వీరిద్దరికీ సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
కాగా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ సంతోషపడుతున్నారు పవర్ స్టార్ అభిమానులు.