చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రు లీడ‌ర్ల‌కు క‌రివేపాకే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు 40 ఏళ్ల‌ సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉంది.రాజ‌కీయాల్లో ఇప్పుడున్న వారిలో దాదాపు అంద‌రూ జూనియ‌ర్లేన‌ని ఆయ‌న చెబుతూ ఉంటారు.

అయితే, పార్టీలోని కొంద‌రు మాత్రం చంద్ర‌బాబును క‌రివేపాకు క‌న్నా ఘోరంగా తీసిపారేస్తున్నారు.ఆయ‌న ఏం చెప్పినా ఇలా విని.

అలా వ‌దిలేస్తున్నారు.త‌మ త‌మ పంతాల‌నే పాటిస్తున్నా రు.

త‌మ ఆధిప‌త్య ధోర‌ణుల‌నే అనుస‌రిస్తున్నారు.గ‌త కొంత‌కాలంగా క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే.

ఇక్క‌డ భూమా, ఏవీ కుటుంబాల వార‌సుల మ‌ధ్య తలెత్తిన విభేదాలు చినుకు చినుకు గాలివాన‌గా మారిన‌చందంగా పార్టీ ప‌రువును గాలిలో క‌లిపేస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మంత్రి భూమా అఖిల ప్రియ‌, దివంగ‌త భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య త‌లెత్తిన వివాదం ఇప్పుడు బ‌జారున ప‌డింది.

మంత్రి అఖిల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ల‌గ‌డ్డ‌పై ఏవీ సుబ్బారెడ్డి ఆశ‌లు పెంచుకున్నారు.వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

అదేస‌మ‌యంలో తాను టీడీపీలో ఎంతో కాలంగా ఉన్నా నని, త‌న‌కూ భారీ ఎత్తున మ‌ద్ద‌తిచ్చే అనుచ‌ర గ‌ణంకూడా ఉంద‌ని ఆయ‌న గ‌తం కొన్నాళ్లుగా వెల్ల‌డిస్తూనే ఉన్నాడు.

దీంతో అఖిలకు, ఏవీకి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో అగాథం ఏర్ప‌డింది.గ‌త ఏడాది జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యం లోనే ఏవీ ఆ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నాడు.

!--nextpage అయితే, అఖిల చ‌క్రం తిప్ప‌డం, సెంటిమెంటు గాలి వీయ‌డం వంటి ప‌రిణామాలు.ఏవీకి టికెట్ రాకుండా చేశాయి.

దీంతో ఆయ‌న వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌పై ఆశ‌లు పెంచుకున్నారు.ఇదే విష‌యాన్ని అధినేత చంద్ర‌బాబుకు కూడా స్ప‌ష్టం చేసిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పోరు జ‌రుగుతోంది.అఖిల‌, ఏవీలు చెరో వ‌ర్గంగా మారిపోయి.

టీడీపీ రాజ కీయాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నారు.దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధినేత చంద్ర‌బాబు.

ఇరు వ‌ర్గాల‌ను మంద‌లించారు.ముఖ్యంగా అఖిల దూకుడుగా ఉన్నార‌ని, త‌గ్గించుకోవాల‌ని హెచ్చ‌రించారు.

అయినా ఈ ఇద్ద‌రిలోనూ మార్పు రాలేదు.తాజాగా ఏవీపై రాళ్ల‌దాడి జ‌ర‌గ‌డం తీవ్ర‌సంచ‌ల‌నంగా మారింది.

సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు.భూమా వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.

సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర ఘటన జరిగింది.గత కొన్ని రోజులుగా మంత్రి భూమా అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ పిలిపించి సయోధ్య కుదిర్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో కర్నూలు జిల్లాలో మున్ముందు ఏం జరగబోతోందనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రముఖ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?