బుద్ధప్రసాద్ కి మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత..
TeluguStop.com
అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్( Mandali Buddha Prasad ) కి మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత( Akhila Bharatha Chiranjeevi Yuvatha) ఉంటుందని, నేటి నుండి ఎన్నికలు అయ్యే వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారంలో తామంతా పాల్గొంటామని అఖిల భారత తెలుగు యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు అన్నారు.
శనివారం అవనిగడ్డ లోని గాంధిక్షేత్రంలో ఏర్పాటుచేసిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధులుగా రవణం స్వామి నాయుడు, మండలి బుద్ధప్రసాద్ లు పాల్గొన్నారు.
మెగా అభిమానులతో పలు విషయాలపై చర్చించారు.అనంతరం స్వామి నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అత్యంత ఇష్టపడే వ్యక్తులలో మండలి బుద్ధప్రసాద్ ఒకరని, నేడు అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ని గెలిపించాలనే ఆలోచనతో చిరంజీవి, నాగేంద్రబాబు ల ఆదేశాల ప్రకారం తాము నియోజకవర్గానికి విచ్చేసినట్లు తెలిపారు.
బుద్ధప్రసాద్ తో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని, అవనిగడ్డ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం బుద్ధప్రసాద్ హయాం లొనే జరిగిందని అన్నారు.
పులిగడ్డ - పెనుముడి వారధి, ఉల్లిపాలెం - భవానీపురం వారధి, అవనిగడ్డ - విజయవాడ కరకట్ట, సముద్రపు కట్టల అభివృద్ధి, కత్తిపూడి - ఒంగోలు హైవే వంటివి బుద్ధప్రసాద్ చొరవ వలన మాత్రమే పూర్తయ్యాయి అని అన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం ఎంత ముఖ్యమో, అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ చాణక్యుడు మండలి బుద్ధప్రసాద్ గెలవడం కూడా అంతే ముఖ్యమని స్వామి నాయుడు అన్నారు.
ప్రతి ఒక్కరూ కూడా గాజు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా బుద్ధప్రసాద్ లను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తనకు మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత బృందాన్ని పంపినందుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి కి ధన్యవాదములు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవితో తనకు, తన కుటుంబసభ్యులకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని, అభిమాన సంఘాల వారిని సేవా నైరతి వైపు మళ్లించి, రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు ఏర్పాటుచేయించి కోట్లమంది ప్రజలకు ఉపయోగపడేలా చేసిన మొట్టమొదటి సినీస్టార్ మెగాస్టార్ అని అన్నారు.
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటికి చిరంజీవి ఆలోచన చేస్తే, స్వామి నాయుడు దానిని ఆచరణలో పెట్టాడని అన్నారు.
కరోనా సమయంలో సైతం ఆపదలో ఉన్నవారికి రక్తం దొరికింది అంటే అది కేవలం చిరంజీవి( Chiranjeevi ) బ్లడ్ బ్యాంకులో మాత్రమేమని అన్నారు.
ఐ బ్యాంకుల ద్వారా చిరంజీవి ఎంతోమందికి కంటి చూపు ప్రసాధిస్తే, చీకటి ఆవరించి ఉన్న సమాజంలో వెలుగులు ప్రసరించేందుకు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి, జనసేన పార్టీని నెలకొల్పారు అన్నారు.
అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందదాయకమని, అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి రానున్న రోజులలో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ని గెలిపించి తీరుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు సుగుణ బాబు, ఎల్.
శ్యాం బాబు, రవీంద్రబాబు, వెంకట్రావు, అనిల్, విష్ణు, కొరియర్ శ్రీను, బాదర్ల లోలాక్షుడు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ బాసు నాంచారయ్య నాయుడు, ఉస్మాన్ షరీఫ్, జనసేన అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు చిలకలపూడి పాపారావు, గుడివాక శివరావు, సిద్దినేని అశోక్ నాయుడు, చెన్నగిరి సత్యన్నారాయణ, నెరుసు కృష్ణాంజనేయులు, మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల గిరి, యువ నాయకులు భోగాది శివ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతికి లో బడ్జెట్ సినిమాలే హిట్.. హనుమాన్, సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసిందిదే!