అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్' టీజర్‌ విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు.

స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్‌ ను అభిమానులు కోలాహం మధ్య మల్లికార్జున్ థియేటర్ లో గ్రాండ్ గా లాంచ్ చేసింది ఏజెంట్ చిత్ర బృందం.

అఖిల్, సాక్షి వైద్య, సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర, డీవోపీ రసూల్ ఎల్లోర్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

సూపర్ స్టార్లు శివ కార్తికేయన్, కిచ్చా సుదీప్ కలిసి తమిళం, కన్నడ భాషలలో 'ఏజెంట్' టీజర్‌ను లాంచ్ చేయగా అఖిల్, మమ్ముట్టి మలయాళంలో వెర్షన్ టీజర్ విడుదల చేసారు.

హిందీ వెర్షన్ టీజర్ కూడా విడుదలైంది.నిమిషం16 సెకన్లు నిడివి గల ఏజెంట్ టీజర్ స్లిక్, స్టైలిష్ యాక్షన్-ప్యాక్డ్ గా అదరగొట్టింది.

నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టిని విచారిస్తుండగా.అతను ఏజెంట్ క్యారెక్టర్ గురించి పవర్ ఫుల్ గా వివరించడం ఆసక్తికరంగా వుంది.

అతన్ని పట్టుకోగలమా ? అని ఓ ఆఫీసర్ అడిగితే.''నో హీఈజ్ అన్ ప్రిడిక్టబుల్.

నో విట్నేస్, నో ఫారిన్సిక్ ఎవిడెన్స్.అతని డెత్‌ నోట్‌ ఆల్రెడీ రాసుంది'' అని మమ్ముటి చెప్పడం టెర్రిఫిక్ గా వుంది.

మహదేవ్ పాత్ర చెప్పినట్లే టీజర్ లో అఖిల్ యాక్షన్ అవుట్ స్టాండింగా వుంది.

చావుకు భయపడిన ఏజెంట్ పాత్రలో కనిపించారు అఖిల్.టీజర్ చివరి తనని చంపని అరిచే సీక్వెన్స్ లో ఏజెంట్ ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలచారు.

"""/"/ యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌తో ఎక్స్ టార్దినరీ నటనతో అఖిల్ మెస్మరైజ్ చేశారు.అఖిల్ మేకోవర్ నిజంగా అద్భుతంగా వుంది.

హీరోయిన్ సాక్షి వైద్య ఏజంట్ ని ‘వైల్డ్ సాలే’అని పిలుస్తూ కూల్‌ అండ్ బ్యూటీఫుల్ గా కనిపించింది.

నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్రలో మమ్ముట్టి హుందాగా కనిపించారు.మహదేవ్ పాత్రలో ఆయన కనిపించిన తీరు ఆ పాత్రకు వన్నె తెచ్చినట్లుగా వుంది.

టీజర్ మొత్తం స్లీల్‌గా, స్టైలిష్‌గా ఉంది, సురేందర్ రెడ్డి విజువలైజేషన్‌ వండర్ఫుల్ గా వుంది.

రసూల్ ఎల్లోర్ ఏజెంట్ వరల్డ్ ని అద్భుతంగా చిత్రీకరించారు.హిప్ హాప్ తమిజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏజంట్ పాత్రని అద్భుతంగా ఎలివేట్ చేసింది.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి.ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి సహ నిర్మాతలు.

"""/"/ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ.ఈ రోజు మాట్లాడానికి రాలేదు.

మీ ఎనర్జీ తీసుకోవడానికి వచ్చాను.అభిమానుల ఎనర్జీ నాకు కావాలి.

క్రాక్, మెంటల్ ఎక్కిపోయింది నాకు.అభిమానులు ఇచ్చిన ఎనర్జీతో నాలో నిప్పు అంటుకుంది.

ఏజెంట్ తో వస్తున్నాం.మీ అందరి ప్రేమ కావాలి'' అన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.ఏజెంట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ'' అన్నారు.

సాక్షి వైద్య మాట్లాడుతూ.ఏజెంట్ టీమ్ లో భాగం కావడం చాలా ఆనందంగా వుంది.

మీ అందరికీ ఏజెంట్ నచ్చుతుంది'' అన్నారు.నిర్మాత అనిల్ మాట్లాడుతూ.

టీజర్ మా ఏజెంట్ చిన్న గన్ నుండి వచ్చిన బుల్లెట్.ఇంకా మిషన్ గన్ వుంది.

ఏజెంట్ సినిమా మిషన్ గన్.ఎప్పుడు వచ్చామా కాదు.

ఎంత గట్టిగా కోడతామన్నదే ముఖ్యం.అఖిల్ అద్భుతంగా చేశారు.

సురేందర్ రెడ్డి అంటేనే స్టయిల్.టీజర్ లో ఆయన స్టయిల్ కనిపించింది.

దీనికి వందరెట్లు సినిమాలో చూస్తారు'' అన్నారు.h3 Class=subheader-styleతారాగణం:/h3p అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి.

H3 Class=subheader-styleసాంకేతిక విభాగం :/h3p దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్ తమిజా, డీవోపీ : రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, పీఆర్వో: వంశీ-శేఖర్.

అల్లు అర్జున్ లో ఆ వేదన ఉంది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!