లాక్ డౌన్ తర్వాతనే అఖిల్-మోనాల్ కలిసేది
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట అంటే అఖిల్- మోనాల్ గజ్జర్ జంట అని చెప్పాలి.
వీళ్ళిద్దరూ హౌస్ లో ఆన్ స్క్రీన్ లో పండించిన రొమాన్స్ అండ్ లవ్ కి అందరూ భాగా కనెక్ట్ అయిపోయారు.
నిజంగానే వీరిద్దరు ప్రేమికులుగా మారిపోయారని అందరూ భావించారు.ఈ కారణంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత వీరిద్దరిని మీడియాలో చాలా మంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించారు.
అయితే తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని, ఇద్దరం మంచి స్నేహితులం అంటూ మోనాల్, అఖిల్ ఇద్దరు స్పష్టం చేశారు.
అయినా మీడియాలో వారి మధ్య ఏదో నడుస్తుందనే టాక్ మాత్రం వినిపిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే వీరిద్దరు మరోసారి ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.
"""/"/
ఈ నేపధ్యంలో తెలుగబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని ఎనౌన్స్ చేశారు.
అయితే ఇది స్టార్ట్ చేసే లోపు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో సెట్స్ పైకి వెళ్ళలేదు.
తరువాత ఈ వెబ్ సిరీస్ గురించి మీడియాలో ఎలాంటి న్యూస్ లేకపోవడంతో మోనాల్-అఖిల్ వెబ్ జోడీని తెరపై చూడటం కష్టం ఏమో అని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో తాజాగా అఖిల్ తామిద్దరి కాంబినేషన్ లో రాబోయే వెబ్ సిరీస్ పై క్లారిటీ ఇచ్చాడు.
లాక్ డౌన్ అనంతరం డేట్స్ అడ్జస్ట్ అయిన వెంటనే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు.
ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?