కొత్త సినిమాలతో అఖిల్ 'బ్యాచిలర్' కు డ్యామేజ్ ఎంత?
TeluguStop.com
అఖిల్ అక్కినేని మొదటి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.ఏడు వారాల్లో 40 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమాకు రెండవ వారం ఎంత వసూళ్లు నమోదు అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కు పోటీగా దసరా బరిలో నిలిచిన మహా సముద్రం మరియు పెళ్లి సందడి సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ రెండు సినిమాల వసూళ్లు చాలా నీరసంగా ఉన్నాయి.
ఇదే సమయంలో బ్యాచిలర్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇక ఈ వారం విడుదల అయిన నాట్యం సినిమా మాత్రమే కాస్త ఫేమ్ ఉన్న సినిమా.
మిగిలిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోవడం మాత్రమే కాకుండా కనీసం జనాలు నోటీస్ చేసే విధంగా కూడా లేవు.
"""/"/
నాట్యం సినిమా క్లాస్ ఆడియన్స్ కు ఆకట్టుకుంటుందేమో కాని బి సి క్లాస్ వారికి ఆ సినిమా ఎక్కే అవకాశాలు కనిపించడం లేదు.
దాంతో నాట్యం సినిమా కూడా వసూళ్ల పరంగా సాదా సీదాగానే ఉండే అవకాశం ఉంది.
ఇక ఈ వారంలో కూడా బ్యాచిలర్ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
40 కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా కు మరో పది కోట్లు అదనంగా వచ్చి చేరడం ఖాయం అని.
తద్వార 50 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఈ వారం విడుదల అయిన సినిమా లు బ్యాచిలర్ కు డ్యామేజీ ఏమీ చేయక పోవచ్చు అంటున్నారు.
ఖచ్చితంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అబ్బాయిలు.. గడ్డం దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!