Akhil Akkineni: పూజ నుంచి నిధి వరకు అఖిల్ తో నటించి కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్స్
TeluguStop.com
అక్కినేని హీరోలకు( Akkineni Heros ) మంచి మన్మధులుగా పేరుంది.అక్కినేని నాగేశ్వర రావు నుంచి నాగ చైతన్య వరకు అందరు మంచి సినిమాలు చేస్తూ తమకు అందిన కాడికి బాగానే నడిపించారు.
కానీ అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్తే కొంత మంది హీరోయిన్స్ ఇప్పుడు భయపడుతున్నారు.
అందుకు గల కారణం అక్కినేని హీరోల్లో మొదటి సినిమాకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో గా పేరు వచ్చిన హీరో అఖిల్.
( Hero Akhil Akkineni ) సిసింద్రీ సినిమాతోనే మంచి పాపులారిటీ వచ్చింది కానీ హీరో గా సెట్ అవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు.
ఎన్నో అంచనాలు నడుమ సినిమాలు విడుదల అవుతున్న ఎందుకో అతడికి మంచి హిట్ ఇవ్వలేకపోతున్నాయి.
కెరీర్ మొత్తం మీద చెప్పుకోదగ్గ సినిమా కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ మాత్రమే.
అయితే ఈ సినిమా విజయం లో ఎక్కువ శాతం వాటా పూజ హెగ్డే కి( Pooja Hegde ) దక్కింది.
ఇక ఇప్పుడు అఖిల్ తో నటిస్తే తమ కెరీర్ ఖతం అని అయన హీరోయిన్స్ భావిస్తుండటం విశేషం.
ఇప్పటి వరకు అఖిల్ తన కెరీర్ లో చేసినవి కేవలం నాలుగు సినిమాలు.
అందులో మొదటి సినిమా అఖిల్ పేరుతోనే వచ్చింది. """/" /
ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ సయేశా సైగల్ నటించగా ఆమె మళ్లి తెలుగు లో ఎక్కడ కనిపించకుండా పోయింది.
ఇక రెండవ సినిమా హలో.ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫుల్ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోయిన్ ప్రియదర్శిని నటించింది.
ఈ సినిమా కూడా పరాజయం పాలవ్వడం తో మళ్లి ఎక్కడ కనిపించడం లేదు.
ఇక ముచ్చటగా మూడవ సినిమా మిస్టర్ మజ్ను.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
"""/" /
ఆమె కూడా మళ్లిఏ సినిమాలోనూ నటించడం లేదు.ఒక్క హరి హర వీర మల్లు సినిమాలో ఉంది కానీ అది ఎప్పటికి షూటింగ్ జరుపుకొని విడుదల అవుతుంది ఎవరికి తెలియదు.
ఇక నాల్గవ సినిమా విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ .ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మొదటి విజయవంతమైన చిత్రం.
అయితే ఈ సినిమాలో నటించిన పూజ కి కూడా ప్రస్తుతం కెరీర్ ఏమి బాగోలేదు.
ఇక అఖిల్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దో చెప్పడం కూడా చాలా కష్టం గా ఉంది.
ఇంత మొండోడా? భార్య క్షమాపణ చెప్పేదాకా నడిసముద్రంలో కదలనన్న భర్త.. ఫన్నీ సీన్!