ఏజెంట్ సినిమాతో మూడింతలు పెరిగిన అఖిల్ మార్కెట్?

అక్కినేని వారసుడిగా అఖిల్ సిసింద్రీ సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అనంతరం ఈయన అక్కినేని కుటుంబం మొత్తం కలిసిన అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు.

అయితే అఖిల్ హీరోగా అఖిల్ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు.అయితే ఈయన నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు.

ఇలా వరుసగా మూడు సినిమాలు చేసినప్పటికీ అఖిల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇకపోతే గత ఏడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దొరికేక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే అఖిల్ సినిమాతో పోలిస్తే ఏజెంట్ సినిమాకి అఖిల్ మార్కెట్ మూడింతలు పెరిగినట్టు తెలుస్తోంది.

ఈయన నటించిన మొదటి సినిమా అఖిల్ ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

అయితే ప్రస్తుతం ఈయన నటించిన ఏజెంట్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కేవలం ఆంధ్ర ఏరియాలో మాత్రమే దాదాపు 30 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

"""/"/ ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమా దాదాపు 50 నుంచి 60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది.

అఖిల్ సినిమా మార్కెట్ తో పోలిస్తే ఏజెంట్ సినిమా మూడింతలు రెట్టింపు అయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన ఈ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ లెక్కల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ లుక్ చూస్తే మాత్రం ఏజెంట్ సినిమాతో అఖిల్ భారీ హిట్టు కొట్టేలా ఉన్నారు.

Hair Coffee Mask : రెండు స్పూన్ల కాఫీ పొడితో ఇలా చేశారంటే రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవ్వడం ఖాయం!