తన ఆల్ టైం ఫేవరేట్ మూవీని రీమేక్ చేయనున్న అఖిల్.. త్వరలోనే అనౌన్స్ !

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్, రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

మరి మన హీరోలు చాలా మంది పక్క ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ ఆయిన్ సినిమాల రైట్స్ ను దక్కించుకుని వాటిని తెలుగులో రీమేక్ చేసి హిట్లు కొడుతున్నారు.

ఇప్పటికే చాలా మంది రీమేక్ సినిమాల్లో నటించారు.ఇక ఇప్పుడు యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా రీమేక్ సినిమా చేస్తున్నాడట.

అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.

దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

"""/"/ బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఒక రీమేక్ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అఖిల్ కు కెరీర్ స్టార్టింగ్ నుండి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా ఏ జవానీ హై దివానీ సినిమా అంటే ఇష్టమని కుదిరితే రీమేక్ చేస్తానని ముందు నుండి చెబుతూ వస్తున్నాడు.

మరి ఆ సమయాం ఇప్పుడు దగ్గర పడింది అంటునాన్రు సినీ వర్గాలు.ఈ సినిమా బాలీవుడ్ లో అప్పట్లో 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 319 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.

"""/"/ ఇక ఇన్నేళ్ళకు ఈ సినిమాను అఖిల్ రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అన్నపుర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందట.

మిగతా వివరాలు త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.మరి ఏజెంట్ తర్వాత అఖిల్ ఈ సినిమా చేస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

పుష్ప 2 లో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ ను సుకుమార్ పట్టించుకోవడం లేదా..?