ఏజెంట్ సినిమాకు అఖిల్ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోవడం లేదా?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.ఈ సినిమా స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కబోతోంది.

ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్, సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్ల‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌తో క‌లిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

అదే మిటంటే హీరో అఖిల్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ ల నుంచి వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటి నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి విజయం సాధించడంతో లెజెండ్ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

ఇందులో కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నాడు అఖిల్.అఖిల్‌ సరసన సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాకు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. """/" / ఈ నెల 15నుంచి ఏజెంట్ సినిమా త‌దుప‌రి షెడ్యూల్‌ ను స్టార్ట్ చేయ‌నుంది.

ఇందులో మల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇటీవలే విడుదలైన ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా కంటే ముందు అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఊహించని విధంగా మంచి సక్సెస్ ను అందుకున్నాడు.

ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

పురుషుల్లో జుట్టు రాలే సమస్యను దూరం చేసే బెస్ట్ హెయిర్ టానిక్ ఇదే!