అక్కినేని ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్.. ఏజెంట్‌ పాన్ ఇండియా కాదట!

అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖిల్ నటించిన ఏజెంట్( Agent ) చిత్రాన్ని ఈనెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

నిన్న మొన్నటి వరకు సినిమా ఆ తేదీకి వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

గత సంవత్సరం నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ను ఈనెల 28న ఆయన విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

"""/"/ కానీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు( Movie Promotions ) మొదలు పెట్టారు.

అయితే ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం లేక పోవడం వల్ల ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయలేక పోతున్నాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఈ నెల 28వ తారీఖున తెలుగు మరియు మలయాళం భాషల్లో మాత్రమే సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా స్వయంగా అఖిల్ అధికారికంగా ప్రకటించాడు.

"""/"/ ఒక మంచి సమయం చూసి హిందీ లో కూడా సినిమా ను తప్పకుండా విడుదల చేస్తామని అఖిల్ పేర్కొన్నాడు.

అయితే తెలుగు లో సూపర్ హిట్ అయ్యితేనే హిందీ లో ఏజెంట్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా లో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి( Mammootty )నటిస్తున్న కారణంగా అక్కడ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలుగు మరియు మలయాళం లో విడుదల చేస్తే పాన్ ఇండియా మూవీ అవ్వదు.

కనుక అక్కినేని ఫ్యాన్స్ కి ఇది పెద్ద నిరాశే అనడం లో సందేహం లేదు.ఏజెంట్ సినిమా కోసం కొందరు హిందీ ప్రేక్షకులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.

వారు ఈ నిర్ణయం తో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇన్నాళ్లు ఊరించి ఇప్పుడు ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?