అన్నయ్యతో మల్టీ స్టారర్‌ పై అఖిల్‌ అక్కినేని క్లారిటీ

అక్కినేని ఫ్యాన్స్( Akkineni Fans ) గత కొంత కాలం గా మరో మల్టీ స్టార్ కోసం ఎదురు చూస్తున్నారు.

మనం( Manam )చిత్రం లో నాగార్జున, నాగచైతన్య మరియు నాగేశ్వరరావు కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఆ సినిమా తర్వాత అఖిల్ మరియు నాగ చైతన్య( Naga Chaitanya )కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు.

"""/"/ తాజాగా ఏజెంట్ సినిమా( Agent ) విడుదల నేపథ్యం లో మీడియా ముందుకు వచ్చిన అఖిల్ మల్టీ స్టారర్ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్‌( Multistarrer ) చేస్తే సమస్య లేదు.

కానీ అన్నదమ్ములు కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేయాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా తేడా ఉంటుంది.

అన్నదమ్ములకు మంచి పాత్రలు లభించాలి.మంచి స్క్రిప్టు లభించాలి అప్పుడే ఆ సినిమా సెట్‌ అవుతుంది అన్నాడు.

"""/"/ మా ఇద్దరికీ సెట్ అయ్యే విధంగా మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా మల్టీస్టారర్ సినిమాలో చేస్తాం అంటూ అఖిల్‌( Akhil ) క్లారిటీ ఇచ్చాడు.

భారీ అంచనాల నడుమాలు పొందిన ఏజెంట్ సినిమా ను ఈనెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

తప్పకుండా తన కెరియర్‌ లో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఏజెంట్ చిత్రం అందిస్తుందనే నమ్మకం తో అఖిల్ సినిమా కోసం కష్టపడ్డట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమా విజయాన్ని సాధిస్తే అఖిల్ నుండి ముందు ముందు భారీ చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో అన్నయ్య తో మల్టీస్టారర్ సినిమాని కూడా అఖిల్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

చైతూ తో కంటే ముందు నాగార్జున తో అఖిల్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఏజెంట్‌ సక్సెస్ అయితే సురేందర్ రెడ్డి( Surendar Reddy ) దర్శకత్వంలో ఒక సినిమా ను అఖిల్ మళ్లీ చేస్తాడట.

గేమ్ ఛేంజర్ రివ్యూ & రేటింగ్