అయ్యగారి సినిమాకు మోక్షం.. అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే!
TeluguStop.com
టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్( Akhil Akkineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అఖిల్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే అఖిల్ సరైన సక్సెస్ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు.
కానీ సరైన సక్సెస్ సినిమా ఒక్కటి కూడా పడటం లేదు.ఇకపోతే అఖిల్ చివరగా ఏజెంట్ మూవీతో( Agent Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
"""/" /
సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమైన విషయం తెలిసిందే.కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటిలోకి విడుదల కాలేదు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు మూవీ మేకర్స్.
ఈ మేరకు ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు.ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో( Sony Liv ) ఉత్కంఠను పెంచే ఈ స్పై థ్రిల్లర్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
"""/" /
ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటి అన్న విషయానికొస్తే.రికీ అనే టాలెంటెడ్ రా ఏజెంట్‌కు ఓ క్లిష్టమైన మిషన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతను అప్పగిస్తారు.
ది డెవిల్ అనే పిలవబడే రా చీఫ్ కల్నల్ మహాదేవ్ ఈ పనిని రికీకి అప్పగిస్తాడు.
ఈ క్రమంలో రికీ రహస్యంగా ఈ పనిని పూర్తి చేసే పనిలో ఉంటాడు.
మరో వైపు ధర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భారతదేశాన్ని నాశనం చేయటానికి పథకం వేస్తాడు.
మిషన్ అనుకోని మలుపులు తీసుకుంటుంది.దీంతో ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్న ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి.
కాగా ఏజెంట్ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు.
వీరు తమ నటనతో సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు.ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు.
Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français