అఖిల్ 'ఏజెంట్' లుక్ పై కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్.. ఎందుకంటే ?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో అక్కినేని అఖిల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

కానీ ఇప్పటి వరకు మంచి కమర్షియల్ హిట్ మాత్రం ఒక్కటి కూడా పడలేదు.

అఖిల్ చేసిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తుంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.కానీ కరోనా కారణంగా విడుదల కాలేని పరిస్థితి.

ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

"""/"/ ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అఖిల్ చాలా మేకోవర్ అయ్యాడు.

లుక్ పూర్తిగా మార్చేశాడు.తాజాగా బయటకు వచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ ఫొటోలో అఖిల్ జుట్టు పెంచేసి, గుబురు గడ్డంతో, మంచి మీసకట్టుతో రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

"""/"/ ఈ ఫోటో చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ కొత్త లుక్ చుస్తే గేమ్ ఆఫ్ థ్రోన్ లో ఉన్న జాన్ స్నోని లాగా ఉన్నాడని నెటిజెన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

అందుకే అఖిల్ లుక్ ను చూసి ఇప్పుడు ఆ సీనియర్ స్టార్ తో పోల్చుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుపు కుంటుంది.ఇప్పటికే అఖిల్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాడు.

మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో.

నాన్నకు దక్కని అదృష్టం నాకు దక్కింది.. బాలయ్య కామెంట్స్ వైరల్!