అఖిల్ ఏజెంట్ డిజిటల్ డీల్ క్లోజ్..!

అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఏజెంట్.

ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.

సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమాలో అఖిల్ మాస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఇప్పటికే సినిమాకు సంబందించిన డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

అఖిల్ ఏజెంట్ సినిమాను అమేజాన్ ప్రైం భారీ ఫ్యాన్సీ ధరకు కొనేసిందని టాక్.

తెలుగు సినిమాలపై అమేజాన్ ప్రైమ్  భారీ ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటల్ రంగంలో మిగతా వాటికి పోటీగా ఉండాలని అమేజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను భారీ రేటుకి కొనేస్తుంది.

అఖిల్ ఏజెంట్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవకుండానే డిజిటల్ రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది.

తెలుగుతో పాటుగా మిగతా భాషల డిజిటల్ రిలీజ్ హక్కులను అమేజాన్ ప్రైం సొంతం చేసుకుందని తెలుస్తుంది.

సైరా నరసింహా రెడ్డి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

షాంపూ జుట్టుకే కాదు ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?