ఈ వారం ఓటిటి లోకి వస్తున్న ఆ రెండు తెలుగు సినిమాలు..?

తెలుగు లో లాస్ట్ మంత్ లో వచ్చిన రెండు సినిమాలు ఈ వారం ఓటిటి ( OTT ) రిలీజ్ కాబోతున్నాయి.

అందులో ఒకటి అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా( Agent Movie ) కాగా, ఇక రెండోవది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా వచ్చిన విరూపాక్ష.

( Virupaksha ) ఈ రెండు సినిమాల్లో విరూపాక్ష సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది.

కార్తిక్ దండు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా గా మిగిలిపోయింది.

"""/" / ఇక ఈ సినిమా కి సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్బుతం గా ఉంది అలాగే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు కూడా చాలా బాగున్నాయి.

దాంతో మొత్తానికి ఈ సినిమా సూపర్ హిట్ అయింది.అలాగే అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తో అఖిల్ భారీ హిట్ కొట్టబోతున్నాడు అని అక్కినేని అభిమానులు అందరూ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.

"""/" / కానీ ఈ సినిమా అందరి అంచనాలను తల కిందులు చేస్తూ ప్లాప్ అయింది.

అందుకే ఈ సినిమా చాలా తోందరగా ఓటిటి లోకి వస్తుంది అయితే నిన్న కాక మొన్న వచ్చిన చిన్న హీరోలు సైతం మంచి హిట్లు కొడుతుంటే మన అఖిల్ మాత్రం ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు అయితే ఒక భారీ హిట్ కొట్టలేకపోయాడు.

దీంతో అఖిల్ మార్కెట్ అనేది భారీ రేంజ్ లో క్రియేట్ చేసుకోలేక పోతున్నాడు.

మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?