అది చేస్తే మాత్రం పాన్ ఇండియా పక్కా..!

నందమూరి బాలకృష్ణ బోయపాటి కలయికలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించిన విషయం చెప్పాల్సిన పనిలేదు.

బోయపాటి - బాలయ్య కలయిక అంటే బ్లాక్ బస్టరే అని మరోసారి రుజువు చేసింది.

ఇక ఇప్పుడు అఖండ 2 సిద్ధం అవుతుంది.ఈ విషయాన్నీ స్వయంగా బాలయ్యనే తెలిపారు.

ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

వీటి తర్వాత అఖండ 2 నే అని బాలయ్య చెప్పుకొచ్చారు.ఈ ఏడాది జరుగుతున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో అఖండ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డిలతో పాటు బాలయ్య కూడా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య.అఖండ సినిమా సబ్జెక్టు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి పరిమితమైంది కాదు.

"""/"/ అఖండ 2కి సబ్జెక్టు లాక్ చేసి పెట్టాం.మా నిర్మాత, దర్శకుడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అఖండ సీక్వెల్ చేసేస్తాం.

అందుకే సినిమాలో ఓ పాయింట్ ని రివీల్ చేయకుండా ఉంచామని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

అఖండ తో రిలీజ్ అయినా కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో ఎంతగా అలరించిందో.

ఏ మేరకు కలెక్షన్లు రాబట్టిందో తెలియంది కాదు.అందుకే అఖండ 2 ను పాన్ ఇండియా లెవల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??