రొమాంటిక్ రెండో ట్రైలర్.. పూరీని దించేశాడు..!

ఆకాష్ పూరీ, కెతిక శర్మ జంటగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్.

పూరీ కనెక్ట్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతుంది.

సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు.ఇక సినిమా నుండి ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజై అంచనాలు పెంచింది.

ఆ ట్రైలర్ చూశాకే రొమాంటిక్ మాములుగా రావట్లేదు.మంచి కంటెంట్ తో వస్తుందని అనుకున్నారు.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ మరో నాలుగు రోజులు ఉందనగా మరో సరికొత్త ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.

రొమాంటిక్ సెకండ్ ట్రైలర్ పూరీని దించేసినట్టే ఉంది.పూరీ డైరెక్ట్ చేసిన సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా రొమాంటిక్ సెకండ్ ట్రైలర్ ఉంది.

సినిమాలో ఆకాష్ పూరీ తన సత్తా చాటాడని ప్రచార చిత్రాలతో తెలుస్తుంది.కెతిక కూడా తన అందాలతో ఆడియెన్స్ ను మంత్ర ముగ్ధుల్ని చేసేందుకు రెడీ అవుతుంది.

మరి రొమాంటిక్ సినిమా ఆకాష్ పూరీ అనుకుంటున్న సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి