అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి..

నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది.

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం.

ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.

పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ ను అభినందించారు.

రవిజంగం దర్శకత్వంలో రాబోతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు.

అఖిల్ కట్ట సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్ కలరు నిర్మించారు.

త్వరలో ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేయనున్నారు.

Vegetables : కూర‌గాయ‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. అయితే ఈ టిప్స్ త‌ప్ప‌క తెలుసుకోండి!