పూరీ పనైపోయింది.. ఆకాష్ హీరో ఏంట్రా.. భారీ డైలాగ్స్ వేసిన ఆకాష్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసారు.

అయితే ఒకానొక సమయంలో పూరి వరస ఫ్లాపుల ఎదుర్కోవడంతో చాలా మంది ఇండస్ట్రీలో పూరి పని అయిపోయింది అంటూ కామెంట్ చేశారు.

అలా కామెంట్ చేసిన వారికి పూరి తనయుడు ఆకాష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ భారీ డైలాగ్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

తాజాగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా పూరి కనెక్ట్ పూరి జగన్నాథ్ టూరింగ్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న టువంటి చిత్రం రొమాంటిక్ అనిల్ పాండరి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా పూరి తనయుడు ఆకాష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు ఇండస్ట్రీలో నాన్న ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు.అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో చాలామంది పూరి పని అయిపోయింది.

ఆకాష్ హీరో ఏంటి అంటూ ఎంతో హేళనగా మాట్లాడారని ఆకాష్ తెలిపారు. """/"/ ఈ క్రమంలోనే ఆకాష్ మాట్లాడుతూ తను ఇండస్ట్రీలో పెరిగారని, తన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా చచ్చేవరకు ఇండస్ట్రీలోనే జీవిస్తానని పూరి జగన్నాథ్ కొడుకుగా పుట్టడం నా అదృష్టం అని ఈ సందర్భంగా తెలిపారు.

నువ్వు ఆకాష్ నా కొడుకు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను.నువ్వు ప్రతి సినిమాను నా మొదటి సినిమా అనుకొని చెయ్ అని చెప్పావు కానీ ఇది నా లాస్ట్ సినిమా అనుకొని ప్రాణం పెట్టి చేస్తానని ఈ సందర్భంగా ఆకాష్ గతంలో తన తండ్రిని అన్న వారి గురించి భారీ డైలాగులతో వారికి సమాధానం చెప్పాడు.

ఇక రొమాంటిక్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఇందులో కేతిక, రమ్యకృష్ణ పాత్రలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.

వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్‌మెంట్‌ పార్క్.. అంతా ఏఐ మహిమ..!