ఛార్మి కోసం భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు.. ఆకాష్ పూరీ ఏం అన్నాడంటే?

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి ల మధ్య ఏదో ఉంది అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇద్దరు క్లోజ్ గా ఉండటంతో వీరిపై ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి హీరోయిన్ ఛార్మి తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరూ బయట ఎక్కువగా కనిపిస్తుండటంతో వీరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా పూరీ జగన్నాథ్ ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వినిపించాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వార్తల పై పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి స్పందించారు.

ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ.పూరి జగన్నాథ్ సినీ కెరియర్ లో చాలా నష్టపోయాడని ఆ సమయంలో తన తల్లికి పరిస్థితులు అర్థమయ్యి ఆ విషయాలు తెలియకుండా ఉండడం కోసం తనని తన చెల్లెలు హాస్టల్ కి పంపించిందట.

ఆ సమయంలో మూడో తరగతి చదువుతున్నాను తెలిపారు.అప్పుడు తన తండ్రి పెద్ద డైరెక్టర్ అని అందరూ హ్యాపీగా అనుకున్నారట.

కానీ కొద్ది రోజుల తర్వాత ఆకాష్ కి అసలు విషయం అర్థమయ్యిందట. """/" / ఫుడ్, వేసుకునే బట్టలు ఉన్న ఇల్లు కార్లు అన్ని అమ్మేసారట.

అలా దాదాపు ఐదేళ్ల పాటు నరకం చూసాను.ఆ తర్వాత తన తండ్రి పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదని వారి ఫ్యామిలీ ప్రస్తుతం ఈ విధంగా ఉందంటే కారణం తన అమ్మనే అని తెలిపారు ఆకాష్ పూరి.

అలాగే అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు.నాన్నకు పెద్ద సపోర్ట్‌ మమ్మీనే.

వాళ్లది లవ్‌ మ్యారేజ్‌.కొందరు టైంపాస్‌ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు.

కానీ అదైతే నిజం కాదు అని చెప్పుకొచ్చాడు ఆకాష్ పూరి.

నా భార్య చాలా మొండిది…  ఎన్టీఆర్ చేసే ఆ వంటకం చాలా ఇష్టం: రాజీవ్ కనకాల