మెడిసిన్ చదువు వదిలి వ్యవసాయం.. సంవత్సరానికి 20 లక్షల సంపాదన..యువ రైతు ఆకాష్ స్టోరీ ఇది...

డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, హీరో కొడుకు హీరో అవుతాడు, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు కానీ రైతు కొడుకు రైతు కాలేడు ఎందుకంటే రైతు కి తెలుసు వ్యవసాయం చేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని.

ప్రభుత్వాలు కూడా రైతులకు సరైన న్యాయం చేయలేకపోతుంది.అలాంటి ఒక రైతు కొడుకు మెడిసిన్ వదిలేసి రైతు అయి నెలకు లక్ష రూపాయలకు పైగా సంపడిస్తున్నాడు.

అతని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన ఆకాష్ చౌరసియా, బుందేల్ ఖడ్ లోని తిల్లి అనే గ్రామానికి చెందిన అతను.

అతని తండ్రి వ్యవసాయం చేసేవాడు, అమ్మ బీడీలు చేసేది.ఆకాష్ తల్లిదండ్రులు అతన్ని ఎంత కష్టపడి అయిన డాక్టర్ ని చేయించాలనుకున్నారు.

అందుకు తగ్గట్టే ఆకాష్ కూడా చదువు లో ముందుండే వాడు.అందుకే తల్లిదండ్రుల కల కోసం తరచు కష్టపడి చదివే వాడు ఎలాగైనా డాక్టర్ అయి చుట్టుపక్కల గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలనుకున్నాడు.

ప్రతిష్టాత్మకమైన AIIMS పరీక్షకు సన్నద్ధం అవుతున్నపుడు తన గమ్యం ఇది కాదు అని తెలుసుకున్నాడు.

తనకి తెలిసిన వాళ్లలో చాలా మంది డాక్టర్లు అయ్యారు, వాళ్ళందరూ డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవలన్న లక్ష్యం తోనే పని చేస్తున్నారని తెలుసుకున్నాడు.

"""/"/ వైద్యం అందించడం కన్నా వాళ్ళకి శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్ని ఇస్తే రోగాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు అనుకోని తండ్రి దారిలోనే 20 ఏళ్ల వయస్సులో ఆకాష్ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు, కానీ తండ్రి చేస్తున్న పద్దతిలో కాదు తను చదువుకున్న పాఠాలు అన్ని వ్యవసాయం కోసం ఉపయోగించుకున్నాడు.

చదువు మానేసి వ్యవసాయం చేస్తాను అన్నప్పుడు తల్లిదండ్రులతో సహా స్నేహితులు బంధువులు ఆకాష్ కి హెచ్చరించారు వ్యవసాయం తో ఏమి చేయలేవు అని కానీ ప్రస్తుతం 2.

5 ఎకరాల భూమిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా కూరగాయలు, ఇంకా ఇతర చెట్ల పెంపకం తో సంవత్సరానికి 12 నుండి 15 లక్షల రూపాయలు సంపదిస్తున్నాడు.

"""/"/ ఆకాష్ 2011 లో వ్యవసాయం మొదలుపెట్టగా మొదటి 6 నెలలో ఎన్నో ఒడిదుడుకులు చూసాడు.

తరువాత ఒక్కో తప్పు ని పునరావృత్తం కాకుండా పంటలు పండించాడు.అతని వ్యవసాయ ఫామ్ లో 15 ఫీట్ల టమోటో చెట్లు ఉంటాయి.

ఒక్క చెట్టు నుండి 10 నుండి 15 కిలోల టమోటో లు వస్తున్నాయి.

అతను చదువుకున్న యూనివర్సిటీ లోని ప్రొఫెసర్లు కూడా ఆకాష్ కి పంటల పెంపకం లో సలహాలు ఇవ్వడం కూడా అతని విజయానికి కారణం అని చెప్తాడు.

ఒకేరకమైన పంట కాకుండా కొన్ని పంటల కలయికల తో ఒకేసారి పెంపకం జరుపుతాడు.

వీటిని మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటారు.ఇప్పటివరకు ఆకాష్ తన ఫామ్ లో 10000 కు పైగా యువరైతులు, వ్యవసాయం మీద మక్కువ ఉన్న వ్యక్తులకు శిక్షణ ఇచ్చాడు.

చదువుని మధ్యలో ఆపేసి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన కూరగాయలను దిగుమతి చేస్తూ కార్పొరేట్ ఉద్యోగి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న ఆకాష్ సక్సెస్ స్టోరీ ఎందరికో స్ఫూర్తి.

సలార్ 2 వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఆ వార్తలకు చెక్ పెట్టినట్టేనా?