వాముతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటే అస్స‌లు న‌మ్మ‌రేమో!

వాము.ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే ఓ దివ్య ఔష‌ధం అన‌డంలో సందేహం లేదు.

వంట‌ల్లో వినియోగించే ఈ దినుసును.ఆయుర్వేదంలో కూడా ఎన్నో ఏళ్లుగా ఉప‌యోగిస్తున్నారు.

కాస్త కారంగా, ఘాటుగా ఉండే వాము.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో వ్యాధుల నుంచి ర‌క్షిస్తుంది.మ‌రి లేట్ చేయ‌కుండా వాము ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటీ? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

అజీర్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి వాము ఓ గొప్ప ఔష‌ధం.ఆహారం జీర్ణం అవ్వ‌న‌ప్పుడు, పొట్ట ఉబ్బ‌రంగా ఉన్న‌ప్పుడు.

ఒక టీ స్పూన్ వాము ఒక గ్లాస్ వాట‌ర్‌లో మ‌రిగించి.గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల త‌క్ష‌ణ ఉప‌శ‌మం పొంద‌డంతో పాటు.ఇత‌రిత‌ర ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి.

"""/" / ప్ర‌తిరోజు అర టీ స్పూన్ వాము తిన‌డం వ‌ల్ల.హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

జ‌లుబు, ద‌గ్గుతో, గొంతునొప్పితో ఇబ్బంది ప‌డేవారు.వేడి పాల‌లో వాము పొడి క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డంలోనూ వాము స‌హాయ‌ప‌డుతుంది.అందుకు వామును కొద్దికొద్దిగా నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే.

త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌గ్గుతుంది.వాములో ఉండే కాల్షియం, పొటాషియం, ఐర‌న్ గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.

ఇక వాములో కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే విట‌మిన్ `ఎ` తో పాటు శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తిని బ‌లోపేతం చేసే విట‌మిన్ `సి` కూడా ఉంటుంది.

అందుకే డైలీ డైట్‌లో వామును చేర్చుకోవ‌డం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన కేసీఆర్..!