తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..వాముతో చెక్ పెట్టండిలా!
TeluguStop.com
వయసు పెరిగే కొద్ది జుట్టు తెల్లబడటం సర్వ సాధారణ విషయం.కానీ, ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, కాలుష్యం, హైపర్ థైరాయిడిజం, స్మోకింగ్, మద్యపానం, పోషకాల లోపం, అధిక ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల నల్ల జుట్టు తెల్లగా మారిపోతూ ఉంటుంది.
ఇక యంగ్ ఏజ్ లో జుట్టు తెల్ల బడితే వారిలో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.
మానసికంగా కృంగిపోతుంటారు.ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నివారించుకునేందుకు రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు.
కొందరు జుట్టు రంగు వేయించుకుంటారు.అయితే సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ముఖ్యంగా తెల్ల జుట్టును నివారించడంలో వాము అద్భుతంగా సహాయపడుతుంది.చూసేందుకు జీలకర్రలా ఉండే వాము రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది.
"""/"/
అలాగే వాము ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి.అయితే కేవలం ఆరోగ్యానికి కాదు సౌందర్య పరంగా కూడా వాము ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో బాధ పడే వారు ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వాము, కరివేపాకు, ఎండు ద్రాక్ష వేసి బాగా మరిగించండి.
ఆ తర్వాత ఈ వాటర్‌ను గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించండి.ఇలా చేస్తే క్రమంగా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
అలాగే వాము నుంచి తీసిన నూనెలో కొద్దిగా ఉసిరి కాయ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు మరియు కేశాలకు పట్టించి ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం మామూలు షాంపూతో తలస్నానం చేసేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.
తెల్ల జుట్టు క్రమంగా నల్ల బడుతుంది.
గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్, శంకర్ ఇద్దరు సక్సెస్ ను సాధిస్తారా..?