షూటింగ్ లో గాయపడ్డ హీరో అజిత్

సౌత్ లో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువగా ప్రమాదక యాక్షన్ సన్నివేశాలు చేసే వారు ఎవరంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేరు అజిత్.

స్వతహాగాగా బైక్ రేసర్ అయిన అజిత్ సినిమాలలోకి వచ్చిన తర్వాత తన టాలెంట్ ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

చాలా సినిమాలో రిస్కీ స్తంట్స్ ఎలాంటి డూప్ లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే బైక్ రేసులు కూడా సినిమాలలో చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇలా చేసిన సందర్భాలలో చాలా సార్లు ప్రమాదాల బారిన పడ్డారు.ఇప్పుడు కూడా అలాగే ప్రమాదకర స్టంట్ చేసి గాయాలకు గురయ్యాడు.

ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో అజిత్ కొత్త సినిమా వాలిమై షూటింగ్ జరుగుతుంది.

ఈ షూటింగ్ లో సందర్భంగా అజిత్ ప్రమాదానికి గురయ్యాడు. """/"/ డూప్ లేకుండా బైక్ తో రిస్కీ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో అజిత్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అజిత్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.అజిత్ గాయపడటంతో షూటింగుకు కొన్ని రోజుల పాటు దూరం కానున్నాడు.

వాలిమై సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.హెచ్.

వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇందులో మెయిన్ విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడు.

అజిత్ కి జోడీగా హుమా ఖురేషి నటిస్తోంది.లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్ళీ వాయిదా పడేలా కనిపిస్తుంది.

చాపకింద నీరులా హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. భారత్‌లో 18కి చేరిన రోగుల సంఖ్య