ఐయాం జస్ట్ అజిత్.. పేరు ముందు ఏమి వద్దన్న స్టార్..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుండి మీడియా, ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ వచ్చింది.

ఇక మీదట తన పేరు ముందు ఎలాంటి పేర్లు పెట్టవద్దని దాని సారాంశం.

తమిళంలో స్టార్ డం కలిగిన అజిత్ ను ఫ్యాన్స్ ముద్దుగా తల అని పిలుస్తారు.

స్టార్ హీరో పేరు ముందు స్క్రీన్ నేమ్ అనేది చాలా కామన్.అది అన్ని ఇండస్ట్రీల్లో ఉండేదే.

కాని అజిత్ కు ఎందుకో అలా ఉండకూడదని అనిపించింది.అందుకే తన పేరు ముందు తల అన్నది వాడవద్దని తన మేనేజర్ ద్వారా ప్రకటన చేయించాడు.

తమిళంలో తల అంటే నాయకుడు అని అర్ధం.మరి అజిత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక కారణాలు ఏమో కాని ఆయన ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.

మీడియా, ఫ్యాన్స్ కు అజిత్ ఈ రిక్వెస్ట్ చేశాడు ఓకే కాని వారు అలా పిలవకుండా ఉంటారా అన్నది ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న.

అసలే త్వరలో అజిత్ 'వాలిమై' సినిమా రిలీజ్ ఉంది.ఆ టైం లో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.

మరి ఈ టైం లో తన పేరు ముందు ఎలాంటి పేర్లు వద్దని అజిత్ చెప్పడం ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది.

మరి ఇది సాధ్యపడే విషయమేనా కాదా అన్నది చూడాలి.

కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ