అజిత్ సినిమా తునివు ను తెలుగు లో దిల్ రాజు ఎంతుకు కొన్నాడో..!

తమిళ స్టార్ హీరో అజిత్ సంక్రాంతి కి తునివు మూవీ ని తెలుగు లో దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు.

అజిత్ ఈ మధ్య కాలం లో తెలుగులో ఏ ఒక్క సినిమాతో సక్సెస్ అవ్వలేక పోయాడు.

అయినా కూడా సినిమా ను దిల్ రాజు ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

కేవలం పోటీ కోసం అన్నట్లుగానే ఈ సినిమా ను దిల్ రాజు కొనుగోలు చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సంక్రాంతి కి తన వారసుడు సినిమా కు పోటీగా సినిమాలను తీసుకొస్తున్నారు.

వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమా లను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగా విడుదల చేయబోతున్నారు.

ఈ సమయం లో దిల్ రాజు తన వారసుడు సినిమా కు సాధ్యమైన అన్ని ఎక్కువ థియేటర్స్ ని కేటాయించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

దాంతో వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమా ల కంటే కూడా ఎక్కువగా వారసుడు సినిమా కు థియేటర్లు లభించబోతున్నాయి.

"""/"/ ఇప్పుడు దిల్ రాజు తునివు సినిమా ను కూడా దక్కించుకోవడం తో తన వద్ద ఉన్న అదనపు థియేటర్లను ఆ సినిమా కు కేటాయించాల్సి ఉంటుంది.

అంటే మైత్రి మూవీ మేకర్స్ వారి వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు దిల్ రాజు థియేటర్లు ఇచ్చే అవకాశం ఉండదు.

తన వద్ద ఉన్న థియేటర్లన్నింటినీ కూడా తన రెండు సినిమాలకు కేటాయించుకుంటే చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాల """/"/పరిస్థితి ఏంటి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐదు కోట్ల రూపాయలకు ఆ సినిమా ను కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు.

అయినా కూడా దిల్ రాజు ఏదో ముందస్తు వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు.

ఒకవేళ తునివు ఫెయిల్ అయితే వెంటనే తన వారసుడు సినిమా యొక్క ప్రింట్ ను ఆ థియేటర్లలో వేసే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి దిల్‌ రాజు చాలా వ్యూహాత్మకంగా సంక్రాంతి పోరులో ముదున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తొలి ప్రయత్నంలోనే సీఏ పరీక్షలో రెండో ర్యాంక్.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!