7 లక్షలతో అజిత్ కటౌట్..!
TeluguStop.com
కోలీవుడ్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.ప్రస్తుతం అజిత్ తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కోసం తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ అంతా సూపర్ జోష్ కనబరుస్తున్నారు.
అయితే కేవలం తమిళనాడులోనే కాదు కేరళలో కూడా అజిత్ ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది.
అజిత్ ఫ్యాన్ ఒకరు ఏకంగా 7 లక్షలు ఖర్చు పెట్టి 120 అడుగుల అజిత్ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు.
ఇంత ఎత్తైన ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. """/"/
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ హీరోల ఫ్యాన్స్ వారి మీద అభిమానం చూపించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేయరు.
ఈ క్రమంలో చాలామంది స్టార్ హీరోల కోసం తమ పాకెట్ మనీ భారీగా ఖర్చు పెట్టేస్తుంటారు ఫ్యాన్స్.
అజిత్ కోసం 7 లక్షలతో కటౌట్ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు కేరళకు చెందిన అజిత్ ఫ్యాన్.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అజిత్ కు చేరుతుందని చెప్పొచ్చు.
ఆ వీరాభిమానిని అజిత్ కలిసే అవకాశం కూడా ఉంది.
వైరల్ వీడియో: తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!