మరో గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఆలస్యం అయ్యిందట!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని జక్కన్న చూస్తున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్‌తో పాటు రామ్ చరణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక మరో హీరో తారక్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తు్న్నాడు.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తు్న్నాడు.

ఇప్పటికే ఆయన తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు.అయితే అజయ్ దేవ్గన్ పుట్టిన రోజు(ఏప్రిల్ 2న) ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది.

కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల అది సాధ్యం కాలేదని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది.

అజయ్ దేవ్గన్ తమ చిత్రంలో నటించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, పరిస్థితులు చక్కబడిన వెంటనే అదిరిపోయే రేంజ్‌లో ఆయన ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?