ఇది సినిమా ట్రైలరా లేక సినిమానా?
TeluguStop.com
సినిమా ట్రైలర్స్ అనేవి ఓ సినిమాకి అద్దం పట్టేవిగా ఉంటాయి.మూవీ ప్రమోషన్స్ లో ట్రైలర్స్ అనేవి చాలా కీలక పాత్రను పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే.
అందుకే మేకర్స్ వీటిని చాలా జాగ్రత్తగా, ఆసక్తికరంగా తీర్చి దిద్దుతారు.ఒక్కసారి సదరు సినిమా ట్రైలర్ వైరల్ అయిందంటే అక్కడే, సగం సినిమా సక్సెస్ అయినట్టు లెక్క.
ఈ క్రమంలోనే ఎడిటర్స్ ఎంతో చాకచక్యంతో సినిమా ట్రైలర్లను కట్ చేస్తూ ఉంటారు.
అయితే సాధారణంగా ఏ సినిమా ట్రైలర్ చూసుకున్నా 2 నిముషాలు మించకుండా ఉంటుంది.
మహాకాకపోతే 3 నిముషాల వ్యవధిని కలిగి ఉంటుంది.అంతకంటే ఎక్కువ నిడివి కలిగిన సినిమా ట్రైలర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.
అంతకంటే ఎక్కువ నిడివి కలిగిన సినిమా ట్రైలర్లను కట్ చేయరు కూడా!
ఎందుకంటే, అంతకుమించి ఎక్కువ నిడివి కలిగిన సినిమా ట్రైలర్లను కట్ చేసినట్లయితే దానిని షార్ట్ ఫిలిం అంటారు మరి! అయితే తాజాగా ఓ సినిమా ట్రైలర్ 5 నిముషాల నిడివితో రిలీజై యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
అదే అజయ్ దేవగన్( Ajay Devgan ) నటించిన సింగం "ఎగైన్"( Singham Again ) సినిమా ట్రైలర్.
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింగం సిరీస్లో భాగంగా ప్రస్తుతం సింగం 3 విడుదలకు రంగం సిద్ధం అయింది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా, బాలీవుడ్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది.
అదే సమయంలో 'ఇది సినిమా ట్రైలరా లేదంటే షార్ట్ ఫిల్మా?' అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
"""/" /
అజయ్ దేవగన్, బాజీరావ్ సింగంగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే మరియు టైగర్ ష్రాఫ్ వంటి వారు నటించడం కొసమెరుపు.
ఇక ఈ చిత్రం అజయ్ దేవగన్ స్వంత బేనర్లో తెరకెక్కడం విశేషం.అక్టోబర్ 7, సోమవారం విడుదల అయిన ఈ చిత్రం యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
దాదాపు 5 నిమిషాల నిడివి కలిగిన సింగం ఎగైన్ ట్రైలర్( Singham Again Trailer ) సినిమా మొత్తం కథను చెప్పేలా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇందులో కావలసినంత యాక్షన్ చొప్పించారు మేకర్స్. """/" /
ఇంకో విషయం ఏమిటంటే, ఈ కధకు ఇతిహాస గాధ అయినటువంటి రామాయణాన్ని జోడించినట్టు చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది.
అజయ్ మరియు కరీనా కపూర్ రాముడు మరియు సీత పాత్రను పోలి ఉండగా, రణ్‌వీర్ సింగ్ లార్డ్ హనుమంతుడిగా మరియు టైగర్ ష్రాఫ్ లక్ష్మణ్‌గా మారడం విశేషం.
బాలీవుడ్ ప్రేక్షకులు రోహిత్ శెట్టి దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు.పైగా ఆయన బాలీవుడ్‌లో చిత్రాలలో అత్యంత విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడనే విషయం విదితమే.
ఇక ఆరుగురు సూపర్‌స్టార్‌లను కలిగి ఉన్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే నవంబర్ 1 వరకు వేచి చూడాల్సిందే.
ఇప్పటికైనా గోపిచంద్ కి సక్సెస్ వస్తుందా లేదా..?