మలయాళ స్టార్ హీరోతో సినిమా చేయనున్న సంచలన దర్శకుడు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే అజయ్ భూపతి( Ajay Bhupathi ) లాంటి డైరెక్టర్ సైతం మంగళవారం సినిమాతో( Mangalavaaram Movie ) మంచి సక్సెస్ ని సాధించాడు.

ఇక ఆయన చేసిన ఆర్ఎక్స్ 100( RX 100 ) సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకు డైరెక్టర్ గా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.

ఆ తర్వాత చేసిన మహా సముద్రం సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మీద చాలామందికి చాలావరకు డౌట్లు అయితే వచ్చాయి.

"""/" / కానీ ఆ డౌట్లను పటాపంచలు చేస్తూ ఆయన చేసిన మంగళవారం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ధనుష్ తో( Dhanush ) సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక ఆయన అనుకున్నట్టుగానే ధనుష్ అతనికి డేట్స్ ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ధనుష్ కాకపోతే దుల్కర్ సల్మాన్ ను( Dulquer Salmaan ) పెట్టి ఆయన ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

"""/" / ఇక రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ చేసిన లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసింది.

కాబట్టి ఆయనతో సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే ఆయన ఈ డిసిజన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న అజయ్ భూపతి ప్రస్తుతం సూపర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడనే చెప్పాలి.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?