అలాంటి సీన్స్ లో ఐశ్వర్యా రాజేష్.. అచలుడులో షాక్ ఇస్తుందా..?
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో స్టార్ డైరక్టర్ బాల డైరక్షన్ లో వస్తున్న సినిమా అచలుడు.
ఈ సినిమాని తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
బాల సినిమాలు రియలిస్టిక్ గా ఉంటాయి.ఈ క్రమంలో అచలుడు సినిమాలో ఐశ్వర్య రాజేష్ సెమీ న్యూడ్ గా కనిపిస్తుందట.
సినిమాలో ఆమె పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందట.ఇన్నాళ్లు క్లాస్ ఇమేజ్ తో కెరియర్ సాగిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాతో ఇమేజ్ మార్చుకోవాలని చూస్తుంది.
తప్పకుండా ఈ సినిమాలో ఆమెకి మంచి పేరు తెచ్చిపెడుతుందని తెలుస్తుంది.ఆకాశమే నీ హద్ధురా.
జై భీమ్ సినిమాలతో సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య బాలతో అచలుడుగా రాబోతున్నాడు.
ఈమధ్యనే కమల్ హాసన్ విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య అరుపులు పెట్టించాడు.
ఇక ఇప్పుడు అచలుడుతో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. తెలుగులో కూడా సూర్యకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.
కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సూర్య ఫ్యాన్స్ కి ఈ సినిమా మరోసారి కిక్ ఇస్తుందని అంటున్నారు.
కాలువలో భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు.. వీడియో చూస్తే గుండె ఆగుద్ది!