ఆ హీరోలతో నటించాలని ఉందని చెప్పిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి.. ఏమైందంటే?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా( Sankranthiki Vasthunnam Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

ఫ్యామిలీతో కలిసి సినిమాను చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది.

సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.సినిమా రిలీజైన తర్వాత కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తో కలిసి యాక్ట్ చేయాలని ఉందని చెప్పగా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ప్రభాస్( Prabhas ) కు జోడీగా నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.

ఈ ఇద్దరు హీరోయిన్లు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / ఒకవేళ ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి ఈ సినిమాకు నో చెప్పి ఉంటే వాళ్ల స్థానంలో నిత్యామీనన్, పూజా హెగ్డే నటించేవారని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతుండటం గమనార్హం.

"""/" / విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తో స్టార్ హీరో వెంకటేశ్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది.

అమెరికాలో టిక్ టాక్ షట్ డౌన్..